తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

డౌన్​లోడ్స్​లో 'సిగ్నల్'​ సరికొత్త రికార్డు

వాట్సాప్‌ నూతన వ్యక్తిగత గోప్యత విధానం పోటీ సంస్ధలకు వరంగా మారింది. నిన్న మొన్నటి వరకు వాట్సాప్​లో మునిగి తేలిన జనం.. ఒక్కసారిగా దాన్ని వీడుతున్నారు. దీంతో టెలిగ్రామ్​, సిగ్నల్​ వంటి సంస్థల డౌన్​లోడ్లు భారీగా పెరిగిపోతున్నాయి. రెండు వారాల్లో సిగ్నల్​ని డౌన్​లోడ్​ చేసుకున్న వారి సంఖ్య రెండు కోట్లకు పైగా పెరిగింది.

Signal logs in 26.4 million downloads in India in less than 15 days
దేశంలో సిగ్నల్​ డౌన్​లోడ్​ల సరికొత్త రికార్డు

By

Published : Jan 19, 2021, 9:25 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన గోప్యతా విధానంతో చాలా మంది సిగ్నల్, టెలిగ్రామ్​ వంటి ప్రత్యామ్నాయ యాప్​లవైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఈ రెండు యాప్​ల డౌన్​లోడ్​లు అమాంతం పెరిగాయి. కేవలం రెండు వారాల వ్యవధిలో భారత్​లో సిగ్నల్​ను డౌన్​లోడ్​ చేసుకున్న వారి సంఖ్య 2 కోట్ల, 64 లక్షలకు పెరిగినట్లు ప్రముఖ అప్లికేషన్​ల విశ్లేషణ సంస్థ 'సెన్సార్​ టవర్'​ పేర్కొంది. గూగుల్​, ఆపిల్​ ప్లే స్టోర్ల నుంచి ఎక్కువ మంది డౌన్​లోడ్​ చేసుకున్న వాటిలో సిగ్నల్​, టెలిగ్రామ్​లు టాప్​లో నిలిచినట్లు తెలిపింది.

ఇప్పటివరకూ టాప్​లో ఉన్న వాట్సాప్​కు ఈ రెండు యాప్​లు ప్రధాన పోటీదారులుగా నిలిచాయని వెల్లడించింది. జనవరి 4 నుంచి 17 వరకు సిగ్నల్​ డౌన్​లోడ్లు 2 కోట్ల 64 లక్షలకు పెరిగితే.. ఇదే సమయంలో టెలిగ్రామ్​ డౌన్​లోడ్లలో 160శాతం వృద్ధి చెందినట్లు పేర్కొంది. ఈ రెండు వారాల సమయంలో వాట్సాప్​ కేవలం 50 లక్షలతో సరిపెట్టుకున్నట్లు స్పష్టం చేసింది.

వాట్సాప్ కొత్త నిబంధనలను వెనక్కి తీసుకోవాలని భారత ప్రభుత్వం వాట్సాప్​కు ఇప్పటికే లేఖ రాసింది. పౌరుల వ్యక్తిగత గోప్యత ప్రమాణాల విషయంలో ఏకపక్ష నిర్ణయం ఆమోదయోగ్యం కాదని వాట్సాప్​కు సూచించింది. కొత్తగా తీసుకువచ్చిన మార్పుల విషయాన్ని పునరాలోచించాలని పేర్కొంది.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details