తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ప్లే స్టోర్​, యాప్ స్టోర్​ నుంచి పబ్​జీ తొలగింపు - పబ్​జీ పై భారత్​లో నిషేధం ఎందుకు

పబ్​జీ సహా చైనాతో సంబంధాలున్న 118 యాప్​లపై కేంద్రం విధించిన నిషేధాన్ని అమలు చేసేపనిలో పడ్డాయి గూగుల్, యాపిల్. ఇందులో భాగంగా పబ్​జీ మొబైల్ గేమ్​ను తమ యాప్​ స్టోర్ల నుంచి తొలగించాయి.

PUBG Mobile removed from app stores in India
యాప్​ స్టోర్ల నుంచి పబ్​జీ తొలగింపు

By

Published : Sep 4, 2020, 1:25 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

భారత్​లో తమ యాప్​ స్టోర్ల నుంచి​ పబ్​జీ మొబైల్ గేమ్​ను తొలగించాయి గూగుల్​, యాపిల్. పబ్​జీ సహా 118 యాప్​లపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన రెండు రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాయి.

దీనితో ప్లే స్టోర్, యాప్​ స్టోర్​ నుంచి కొత్తగా పబ్​జీ మొబైల్​ గేమ్​ను డౌన్​లోడ్ చేసుకోవడం కుదరదు. అయితే ఇప్పటికే తమ ఫోన్లలో పబ్​జీని డౌన్​లోడ్ చేసుకున్న యూజర్లు దానిని వినియోగించేందుకు ప్రస్తుతానికి వీలుంది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పబ్​ జీని బ్లాక్​ చేస్తే ఇప్పటికే డౌన్​లోడ్ చేసుకున్నవారు కూడా గేమ్​ను ఆడేందుకు వీలుకాదు.

సర్వీస్ ప్రొవైడర్లు బ్లాక్ చేస్తే..

ఇంతకు ముందు టిక్​టాక్​పై నిషేధం విధించినప్పుడు కూడా ఆ యాప్​ను కొత్తగా డౌన్​లోడ్ చేసుకునేందుకు వీలు లేకుండా గూగుల్, యాపిల్​ తమ యాప్​ స్టోర్​ల నుంచి ఆ యాప్​ను తొలగించాయి. ఆ తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు టిక్​టాక్​ను బ్లాక్ చేశాయి. దీనితో అప్పటికే డౌన్​లోడ్ చేసుకున్నవారు కూడా దాన్ని వాడేందుకు వీలులేకుండా చేసింది కేంద్రం.

పబ్​జీ విషయంలోనూ ఇప్పటికే ఇన్​స్టాల్​ చేసుకున్నవారు గేమ్ ఆడేందుకు అవకాశం ఉంది. అయితే త్వరలోనే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఈ గేమ్​నూ బ్లాక్​ చేయనున్నారు.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details