ఒప్పో సంస్థ తాజాగా రెనో 4 ప్రోను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆగస్టు 5నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. నాలుగు కెమెరాలతో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 34,990గా నిర్ణయించింది.
36 నిమిషాల్లోనే ఫోన్‌ను 100 శాతం ఛార్జ్ చేయనున్నట్లు ప్రకటించింది సంస్థ. అత్యాధునికమైన కర్వ్డ్ డిస్ప్లేతో స్మార్ట్‌ఫోన్ ప్రియుల మనసు దోచేస్తోంది రెనో 4 ప్రో.
ఫీచర్లు
- 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
- వెనకవైపు నాలుగు కెమెరాలు(48ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ సెన్సార్లు)
- 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
- కలర్ ఓఎస్ 7.2
- 65 వాట్ సూపర్‌వూక్ 2.0తో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
- హిడెన్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ 4.0
- 6.5 అంగుళాల సూపర్ అమోలెడ్ 3డీ బార్డర్‌లెస్ సెన్స్ స్క్రీన్