ఫ్లాగ్‌షిప్ ఫోన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటన్న వన్‌ప్లస్.. తన 8 సిరీస్‌లో కొత్త ఫోన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. వన్‌ప్లస్ 8టీ పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ ఫోన్‌కు సంబంధించిన ఫొటోను ఆండ్రాయిడ్ 11 డెవలపర్ ప్రివ్యూ సదస్సులో విడుదల చేశారు. ఫోన్‌కు సంబంధించిన ఇతర వివరాలు మాత్రం తెలియరాలేదు. టెక్ నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వన్‌ప్లస్ 8, 8 ప్రో మోడల్స్ కంటే ఇది భిన్నంగా ఉండనుందట.
ఫీచర్స్..
ఫీచర్స్ విషయానికొస్తే క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్ 865 ప్లస్ ప్రాసెసర్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్)తో పనిచేస్తుందట. పంచ్ హోల్ కటౌట్ డిస్‌ప్లే ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్/ 128 జీబీ ఇంటర్నెట్ స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 64 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాను అమర్చినట్లు టెక్ వర్గాలు తెలిపాయి.