ఎంతోకాలంగా ఊరిస్తోన్న ఎల్జీ వింగ్ స్మార్ట్‌ఫోన్‌ను ఎట్టకేలకు ఈ దిగ్గజ సంస్థ మంగళవారం ఆవిష్కరించింది. దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ఈ 5జీ మొబైల్‌ను విడుదల చేసింది ఎల్జీ.
ఈ ఫోన్లో 'T' ఆకారంలో రెండు తెరలు ఉంటాయి. ప్రైమరీ తెర 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ పీ-ఓఎల్ఈడీ డిస్ప్లే (20.5.9 యాస్పెక్ట్ రేషియా) ఉంటుంది. ఈ తెరను తిప్పితే 3.9 అంగుళాల జీ-ఓఎల్ఈడీ డిస్ప్లే ప్రత్యక్షమవటం ఈ ఫోన్ ప్రత్యేకత.
రెండు తెరలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా పనిచేస్తాయి. ప్రైమరీ తెరను ఉపయోగిస్తున్న సమయంలో రెండో స్క్రీన్‌లో నోటిఫికేషన్లు చూసుకునే సౌలభ్యం ఉంటుంది.
ఇతర ప్రత్యేకతలు..
- స్టోరేజీ: 8జీబీ+ 128జీబీ/256జీబీ (2టీబీ ఎక్స్పాండబుల్)
- ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 (క్యూ ఓఎస్)
- ప్రాసెసర్: క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 756 జీ (స్నాప్‌డ్రాగన్ X52జీ మోడెమ్- ఆర్ఎఫ్ సిస్టం)
- వెనుక కెమెరా: 64 ఎంపీ + 13 ఎంపీ + 12 ఎంపీ
- వాటర్ రెసిస్ట్: ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్
- బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్ (క్విక్ఛార్జి 4.0 సపోర్ట్)
- బరువు: 260గ్రాములు
ఎల్జీ వింగ్ మొబైల్ తొలుత దక్షిణ కొరియాలో లాంచ్ చేశారు. ఉత్తర అమెరికా, ఐరోపాలోని కీలక మార్కెట్లలో వచ్చే నెల విడుదల చేయనున్నారు. అయితే, మొబైల్ ధరపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు ఎల్జీ.
ఇదీ చూడండి:రూ.20వేలలో ఫోన్ కొనాలా? ఇవి చూడండి...