ప్రముఖ వ్యాపార సంస్థ రిలయన్స్ జియో.. నూతన మొబైల్ బ్రౌజర్ 'జియో పేజెస్'ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సమాచార గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా దీన్ని రూపొందించారు. వేగవంతమైన పనితీరుతో పాటు దేశీయ ప్రజలను ఆకర్షించేలా జియో పేజెస్‌లో ఫీచర్స్ జోడించారు.
ETV Bharat / science-and-technology
సరికొత్త బ్రౌజర్ 'జియో పేజెస్' ప్రత్యేకతలు ఇవే.. - features of jio browser
రిలయన్స్ జియో సరికొత్త మొబైల్ బ్రౌజర్‌ను తీసుకొని వచ్చింది. 'జియో పేజెస్' పేరిట విడుదలైన ఈ యాప్.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తి మేడ్-ఇన్-ఇండియా యాప్‌గా ఎనిమిది భాషల్లో రూపుదిద్దుకుంది.

సరికొత్త బౌజర్ 'జియో పేజెస్' ప్రత్యేకతలు ఇవే..!
ప్రత్యేకతలు ఇవే...
- కావాల్సిన పేజీలను వేగంగా యాక్సెస్
- హైస్పీడ్ మీడియా స్ట్రీమింగ్
- తెలుగు,తమిళం, హిందీ వంటి ఎనిమిది స్థానిక భాషల్లో బ్రౌజింగ్‌కు అవకాశం
- ప్రాంతీయ భాషల్లో పాపులర్ అయిన సైట్లను ముందుగానే గుర్తించి చూపిస్తుంది
- యూజర్ ఫ్రెండ్లీగా ఉంటూ సమాచార గోప్యతపై మరింత దృష్టి
- యూజర్‌కు కావాల్సిన స్రీన్ మాత్రమే ఎంచుకునే అవకాశం
- సెర్చ్ ఇంజిన్లు అన్నీ ఓకే చోట లభ్యం. కోరిన వాటిని పిన్ చేసుకునే సదుపాయం
- రాత్రి పూట కంటి చూపు దెబ్బతినకుండా ఉండడానికి 'డార్క్‌మోడ్' ఆప్షన్
- ట్రెండింగ్ విషయాలకు, వార్తలను, మార్కెట్ కబుర్లను చూపించేందుకు ఇన్ఫర్మేటివ్ కార్డు
- వ్యక్తిగత ఉపయోగానికి పిన్‌కోడ్, వేలిముద్రల సదుపాయం
Last Updated : Feb 16, 2021, 7:31 PM IST