గూగుల్ మ్యాప్స్ ఇక నుంచి ఐఓఎస్ పరికరాల్లోనూ దర్శనమివ్వబోతున్నాయి. కార్ల నుంచి చేతి వాచీల వరకు... యాపిల్ డివైజెస్‌లో మ్యాప్స్ ఉపయోగించుకోవచ్చని గూగుల్ ప్రకటించింది.
గూగుల్ మ్యాప్స్ నేవిగేషన్ నుంచి బయటకు రాకుండానే కార్ప్లే డాష్‌బోర్డ్‌లో పాటలు మార్చడం, సౌండ్ అడ్జస్ట్ చేసుకోవడం వంటివి చేసుకోవచ్చని పేర్కొంది.
"స్ప్లిట్ స్క్రీన్‌పై సమాచారం డిస్ప్లే అవుతుంది. కాబట్టి రహదారిపై దృష్టిసారిస్తూనే మీకు కావాల్సిన సమాచారాన్ని మరో తెరపై తెలుసుకోవచ్చు. వాచీలో నేవిగేషన్ను ఎక్కడివరకు కొనసాగించారో.. అక్కడి నుంచే మీ ఫోన్లో మళ్లీ పునఃప్రారంభించవచ్చు."
-గూగుల్
కార్ప్లే డాష్‌బోర్డ్‌లో గూగుల్ మ్యాప్స్‌ను ఈ వారంలో తీసుకురానున్నట్లు గూగుల్ స్పష్టం చేసింది. తర్వాతి ఐఓఎస్ అప్డేట్లో దీన్ని అనుసంధానించనున్నట్లు పేర్కొంది. ఐఓఎస్ వాచీల్లో మాత్రం మ్యాప్స్ వచ్చేందుకు కాస్త సమయం పట్టేలా ఉంది. కొద్దివారాల తర్వాతి అప్డేట్లో మ్యాప్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది గూగుల్.
సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లో అందుబాటులో ఉండే కార్, బైక్ నేవిగేషన్ సహా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నడక దారిని సైతం యాపిల్ వాచ్‌ల ద్వారా చూడవచ్చు. ప్రయాణ సమయం, మార్గం, గమ్య స్థానాలను గుర్తించవచ్చు. ఇల్లు, ఆఫీస్ అడ్రస్‌లను ముందుగానే వాచ్‌లో లోడ్ చేసుకోవచ్చు.
ఇదీ చదవండి-'కనిష్ఠ స్థాయికి జీడీపీ- 'మోదీ ఉంటే సాధ్యమే''