తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

మొక్కజొన్న ఊక నుంచి కార్బన్ ఎలక్ట్రోడ్లను ఉత్పత్తి చేసిన ఐఐటీ-హెచ్ - మొక్కజొన్న ఊక నుంచి కార్బన్ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి చేసిన ఐఐటీహెచ్

ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ- హైదరాబాద్) పరిశోధకులు అధిక వోల్టేజీ సూపర్ కెపాసిటర్ల కోసం తక్కువ ఖర్చుతో మొక్కజొన్న ఊక నుంచి యాక్టివేటెడ్ కార్బన్ ఎలక్​ట్రోడ్​ను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు. దేశంలో మొక్కజొన్న ఊక వ్యర్థాలు పెద్దమొత్తంలో ఉత్పత్తి అవుతున్నందున వీటిని ఎలక్ట్రోడ్ పదార్థంగా మార్చడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చని పరిశోధకులు వెల్లడించారు.

carbon electrode production by iith using corn husk
మొక్కజొన్న ఊక నుంచి కార్బన్ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి చేసిన ఐఐటీహెచ్

By

Published : Jul 29, 2020, 8:30 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

అధిక వోల్టేజీ సూపర్ కెపాసిటర్ల కోసం ఇండియన్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీ(ఐఐటీ- హైదరాబాద్) పరిశోధకులు తక్కువ ఖర్చుతో మొక్కజొన్న ఊక నుంచి యాక్టివేటెడ్ కార్బన్ ఎలక్​ట్రోడ్​ను ఉత్పత్తి చేసే విధానాన్ని అభివృద్ధి చేశారు.

సాధారణంగా మొక్కజొన్న నుంచి వేరు చేసిన ఊకను కాల్చేస్తారు. అలా కాకుండా వాటిని ఎలక్ట్రోడ్లుగా మారిస్తే రైతులకు అదనపు ఆదాయం వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. సంప్రదాయక సూపర్- కెపాసిటర్లతో పోలిస్తే మొక్కజొన్న ఊకతో చేసిన ఎలక్ట్రోడ్లు మెరుగైన పనితీరును చూపిస్తాయన్నారు.

''శక్తి నిల్వ పరికరాల అభివృద్ధిలో కార్బన్ ఆధారిత ఎలక్ట్రోడ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి సాధారణంగా పాలిమర్లు, సేంద్రీయ పూర్వగాములు, అధిక స్వచ్ఛత వాయువుల వంటి ఖరీదైన వాటి నుంచి ఉత్పత్తి చేయబడతాయి. బయోమాస్ నుంచి కార్బన్ ఎలక్ట్రోడ్ల ఉత్పత్తి చాలా సులువైన ప్రక్రియ''

-పరిశోధకులు

ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో పెద్దమొత్తంలో మొక్కజొన్న ఊక వ్యర్థాలను ఉత్పత్తి అవుతుంది. ఇందువల్ల వీటిని ఎలక్ట్రోడ్ పదార్థంగా మార్చడం ద్వారా అనేక లాభాలు పొందవచ్చు. ఐఐటీ-హెచ్​లోని మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్​గా పనిచేస్తున్న అతుల్ సురేష్ దేశ్​పాండే, హైదరాబాద్​ లోని ఏఆర్​సీఐలో అసోసియేట్ డైరెక్టర్​ అయిన టి.ఎన్.రావు కలిసి పరిశోధకుల బృందానికి నాయకత్వం వహించారు.

ఇవీ చూడండి: కరోనాతో ఆర్టీసీకి తగ్గిన ఆదాయం.. పార్శిల్​పైనే ఆశలు

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details