తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2020, 6:12 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ETV Bharat / science-and-technology

ఉత్తమ సెట్​టాప్ బాక్స్​ను ఎంపిక చేసుకోండిలా...

చాలా కాలం వరకు టీవీలకే పరిమితమైన వీడియో కంటెంట్ ఇప్పుడు ఓటీటీల్లోనూ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శాటిలైట్ టీవీ సేలందించే ఆపరేటర్లే ఓటీటీ సేవలను అందిస్తున్నాయి. స్మార్ట్​ సెట్​టాప్​ బాక్స్ ద్వారా ఈ రెండు సేవలను ఒకే దగ్గర అందించగలుగుతున్నాయి ఆయా సంస్థలు. మరి మీ అవసరాలకు తగ్గట్లు ఎలాంటి సెట్​టాప్​ బాక్స్ తీసుకోవాలో తెలుసుకోండి ఇప్పుడే.

Best smart Set-top box in the market
మార్కెట్​లో ఉత్తమ సెట్​టాప్ బాక్స్

ఇటీవల వీడియో కంటెంట్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. శాటిలైట్ టీవీల నుంచి ఓటీటీ ప్లాట్​ ఫామ్​లలో వచ్చే ఎంటర్​టైన్మెంట్ కంటెంట్​ను.. పెద్ద సంఖ్యలో చూస్తున్నారు ప్రేక్షకులు.

కొన్నాళ్ల వరకు శాటిలైట్ టీవీలో వచ్చే వీడియో కంటెంట్​ను, ఓటీటీల్లో వచ్చే కంటెంట్​ను వేర్వేరు డివైజ్​ల ద్వారా చూడాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ సమస్యను తీర్చేందుకు స్మార్ట్ సెట్​టాప్ ​బాక్స్​లు అందుబాటులోకి వచ్చాయి. వీటితో టీవీలోనే శాటిలైట్ ఛానెళ్లతో పాటు ఓటీటీ కంటెంట్​ను చూచొచ్చు.

మరి ప్రస్తుత అవసరాలను బట్టి ఉత్తమ సెట్​టాప్ బాక్స్​ను ఎలా ఎంపిక చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మొదట మీకు ఎలాంటి సెటాప్​ బాక్స్​ కావాలో నిర్ణయించుకోవాలి. శాటిలైట్ టీవీ మాత్రం వస్తే చాలు అనుకునేవారు సాధారణ సెట్​టాప్​ బాక్స్​ను తీసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయాలన్నా, ఓటీటీ కంటెంట్​ చూడాలన్నా... ఆండ్రాయిడ్ సెట్​టాప్ బాక్స్​లను తీసుకోవాలి.

స్మార్ట్​ బాక్స్​లు..

సాధారణ సెట్​టాప్ బాక్స్​లతో పోలిస్తే.. ఆండ్రాయిడ్ సెట్​టాప్​ బాక్స్​ల ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. విడివిడిగా వేర్వేరు సేలకు అయ్యే ఖర్చుతో పోలిస్తే వీటి ధర తక్కువనే చెప్పాలి.

ప్రస్తుతం మార్కెట్​లో ఎయిర్​టెల్ ఎక్స్​ట్రీమ్ బాక్స్, టాటా స్కై బింజ్+ వంటివి రూ.4,000 లోపు అందుబాటులో ఉన్నాయి.

ఆపరేటర్లు..

మీరు ఎలాంటి సెట్​టాప్ బాక్స్​ కావాలో నిర్ణయించుకున్న తర్వాత.. ఆపరేటర్​ను ఎంపిక చేసుకోవాలి.

టాటా స్కై, డిష్​ టీవీ, డీ2హెచ్, ఎయిర్​టెల్ డిజిటల్ టీవీ, సన్​ డైరెక్ట్ వంటి ఆపరేటర్లు మీ అవసరాలను బట్టి మల్టిపుల్ సెట్​టాప్​ బాక్స్​లను అందిస్తున్నాయి. ఇందులో మీ బడ్జెట్​కు ఏది సరిపోతుందో చూసుకోవాలి.

మీకు ఓకే ఇంట్లో ఒకటి మించి కనెక్షన్​లు అవసరమైతే ఏ ఆపరేటర్​ తక్కువ ఛార్జ్ చేస్తున్నారనేది బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:ఏంటీ బిట్​కాయిన్? భారత్​లో పెట్టుబడి పెట్టొచ్చా?

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details