తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఇక గూగుల్​ పే చేస్తే.. ఛార్జీలు వర్తించును! - గూగుల్​పే వెబ్​యాప్ పేమెంట్ సేవల నిలిపివేత ప్రకటన

వెబ్​యాప్ సేవలు 2021 జనవరి నుంచి నిలిపివేయనున్నట్లు గూగుల్ పే తెలిపింది. అలాగే తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు వసూలు చేసే యోచనలో గూగుల్ పే ఉన్నట్లు తెలుస్తోంది.

Google pay Web app will stop working From January
గూగుల్​ పే వెబ్​యాప్ సేవలు జనవరి నుంచి నలిపివేత

By

Published : Nov 24, 2020, 1:11 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

గూగుల్ పే వెబ్​ యాప్​లో.. పీర్​-టూ-పీర్ పేమెంట్​ సదుపాయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నిలిపేసేందుకు సిద్ధమైంది. దీనితో పాటు తక్షణ నగదు బదిలీకి ఛార్జీలు వసులు చేయాలని భావిస్తున్నట్లు మీడియా నివేదికల ద్వారా తెలిసింది.

గూగుల్​ పే ప్రస్తుతం మొబైల్ యాప్​ సహా.. పే డాట్ గూగుల్​ డాట్​కామ్ ద్వారా నగదు బదిలీ సేవలందిస్తోంది. జనవరి నుంచి వెబ్​ యాప్ సేవలు నిలిచిపోనున్నట్లు ఓ నోటీసులో పేర్కొంది గూగుల్ పే. మొబైల్ యాప్ సేవలు మాత్రం కొనసాగనున్నాయి.

ఐఓఎస్​, ఐఓఎస్​ యూజర్లకు గూగుల్ పే సరికొత్త ఫీచర్లను ఇటీవలే పరిచయం చేసింది. తొలుత అమెరికాలోని వినియోగదారులకు ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్లు అందించి.. మిగతా యూజర్లకు ఇటీవలే ఈ ఫీచర్లను తీసుకొచ్చింది.

ఇదీ చూడండి:బిల్​గేట్స్​ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి మస్క్

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details