తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

'విలో' ఉంటే మీరు చేత్తో బ్రష్ పట్టుకోనక్కర్లేదు! - French innovation wilo robot

పొద్దున్నా, రాత్రీ పళ్లు తోముకోవడం అవసరమూ అలవాటూ మనకి. అంతా బాగున్నప్పుడు ఇది చిన్న పనే. కానీ ఎవరి పనులు వాళ్లు చేసుకోలేని సందర్భాల్లో అది చాలా పెద్ద పనే. అందుకని ఆ పని చేసిపెట్టే రోబోని తయారుచేశాడు ఓ ఫ్రెంచ్‌ దంతవైద్యుడు.

French innovation wilo robot will brush your teeth
పళ్లు తోమే విలో రోబో

By

Published : Dec 27, 2020, 7:49 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

'విలో’ అనే ఈ రోబో ఉంటే మనం చేత్తో బ్రష్‌ పట్టుకోనక్కర లేకుండా దంతాలు శుభ్రం చేసుకోవచ్చు. మనిషి దంతకట్టు ఆకారంలో ఉండి చివర నైలాన్‌ కుచ్చులు ఉన్న సిలికాన్‌ బ్రష్‌ని నోట్లో పెట్టి పెదాలు గట్టిగా మూసుకుని విలోని ఆన్‌ చేస్తే చాలు. దానిలోపల ఉండే టూత్‌పేస్ట్‌నీ మౌత్‌వాష్‌నీ తీసుకుని దంతాలనీ చిగుళ్లనీ నాలుకనీ శుభ్రం చేసేస్తుంది. దానికే జతచేసి ఉన్న పైప్‌ ద్వారా నీటిని బయటకు పంపించేస్తుంది.

మొత్తం దంతాలన్నిటినీ కవర్‌ చేసేలా ఉంటుంది కాబట్టి దాన్ని చేత్తో ఆ పక్కకీ ఈ పక్కకీ తిప్పే అవసరం కూడా ఉండదు. మామూలుగా చేత్తో బ్రష్‌ చేసుకుంటే దంతాలు 40 శాతం మాత్రమే శుభ్రమవుతాయనీ, అదే విలోతో అయితే దంతాలకు పట్టిన గార పూర్తిగా తొలగిపోతుందని హామీ ఇస్తున్నారు నిపుణులు. కరెంటుతో పనిచేసే దీన్ని ఎవరైనా రోజూ వాడుకోవచ్చట. పిల్లల నుంచి పెద్దల వరకూ వాడుకోవడానికి వీలుగా నాలుగు సైజుల్లో తయారుచేస్తోంది కంపెనీ.

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details