భారత్ మార్కెట్లోకి 5జీ స్మార్ట్ఫోన్ల రాక పెరిగింది. వరుసగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి పలు స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు. ఈ నేపథ్యంలో మోటోరోలా... మోటోజీ 5జీని భారత్ విపణిలోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్ డిసెంబరు 7 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20,999కు బూడిద, వెండి రంగుల్లో లభించనుంది.
ETV Bharat / science-and-technology
అదిరే ఫీచర్లతో మోటోజీ 5జీ - Moto G 5G
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా.. సరికొత్త ఫీచర్లతో మోటోజీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర, ఇతర ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మార్కెట్లోకి మోటోజీ 5జీ- ఫీచర్లు ఇవే..
ఫీచర్లు ఇవే..
- 6.7 అంగుళాల హెచ్డీఆర్ డిస్ ప్లే
- క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్
- 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో (మెమొరీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు ఉంది)
- వెనకవైపు మూడు కెమెరాలు(48 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మాక్రో లెన్స్)
- 16 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం(ఇది 20 వాట్ పాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది)
Last Updated : Feb 16, 2021, 7:31 PM IST