తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి 'ఫౌజీ' గేమ్​ - nCore Games latest news

దేశీయ గేమింగ్​ సంస్థ ఎన్​కోర్​ గేమ్స్​ అభివృద్ధి చేసిన ఫౌజీ యాప్​ను‌.. అంతర్జాతీయంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్​ను గూగుల్‌ ప్లేస్టోర్‌లో ఉచితంగా ఉంచినట్లు సంస్థ పేర్కొంది.

FAU-G now globally available on Google play store
ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి 'ఫౌజీ' గేమ్​

By

Published : Feb 6, 2021, 4:49 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

భారత ఎన్‌కోర్‌ గేమింగ్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన ఆన్‌లైన్‌ మల్టిప్లేయర్‌ గేమింగ్‌ యాప్‌ ఫౌజీని అంతర్జాతీయంగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తెచ్చారు. చైనా సంస్థకు చెందిన పబ్‌జీని భారత్‌లో నిషేధించిన తర్వాత జనవరి 26న ఈ ఫౌజీ గేమింగ్‌ యాప్‌ను స్వదేశీ ఎన్‌కోర్‌ గేమ్స్‌ సంస్థ అందుబాటులోకి తెచ్చింది.

ఇప్పుడు ఈ యాప్​ అంతర్జాతీయంగా అందుబాటులోకి తేవటం ఎంతో గర్వంగా ఉందన్న సంస్థ.. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. భారత్‌లో ఈ యాప్‌ అందుబాటులోకి వచ్చిన 24గంటల్లోనే 5లక్షల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారని సంస్థ పేర్కొంది.

ఆండ్రాయిడ్‌ వర్షన్‌లో ఈ గేమింగ్‌యాప్‌ని అందుబాటులోకి తెచ్చిన సంస్థ.. ఐఓఎస్​లో ఇంకా తీసుకురాలేదు.

ఇదీ చూడండి:'భారతరత్న' ప్రచారం ఆపండి- నెటిజన్లకు టాటా విజ్ఞప్తి

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details