వినియోగదారుల డేటా భద్రత కోసం ఫేస్బుక్ మరిన్ని చర్యలు తీసుకుంటోంది. అదనపు రక్షణ కోసం వచ్చే ఏడాది నుంచి ఫేస్బుక్ మొబైల్ యాప్‌లో 'హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీ'ని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. వినియోగదారులు.. రిటైలర్ల నుంచి ఈ హార్డ్‌వేర్ 'కీ'ని కొనుగోలు చేసి ఫేస్‌బుక్‌తో రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొంది. లాగిన్ అయ్యే ముందు పాస్‌వర్డ్‌తో పాటు ఈ కీని ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది.
దీంతో పాటు సొంత సెక్యురిటీ ప్రోగ్రామ్ అయిన 'ఫేస్బుక్ ప్రొటెక్ట్'ను మరింత విస్తరించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. హై ప్రొఫైల్ ఖాతాలకు అందుబాటులో ఉన్న ఈ వెసులుబాటును మరిన్ని అకౌంట్లకు వర్తింపజేయనున్నట్లు తెలిపింది.