రోబోలపై మన అవగాహన రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు కూడా మనుషులకు సహాయం చేసే వినూత్న రోబోల కోసం నిరంతరం కృషి చేస్తున్నాయి. మానవులకు సాయం చేసేందుకు.. బోస్టన్ రోబోటిక్స్ రూపొందించిన రోబో డాగ్ వంటి వాటిని మనం ఇప్పటికే చూశాము. ఇప్పుడు బరువైన వస్తువులను మోయడంలో మనుషులకు సాయం చేసే కొత్త రకం రోబోను తయారు చేసింది మరో సంస్థ.
డిజిట్ అని పిలువబడే ఈ హ్యూమనాయిడ్ రోబో.. ఫ్యాక్టరీల్లో, కార్యాలయాల్లో పెద్ద పెద్ద బాక్సులు, వస్తువులను ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మార్చగలుగుతుంది. ఇతర రోబోలతో పోలిస్తే ఈ రోబో డిజైన్ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ రోబోకు అసలు తల ఉండదు.