తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఇకపై మొబైల్​లో పబ్​జీ ఉన్నా గేమ్ ఆడలేరు.. - చైనా యాప్​ల బ్యాన్ వార్తలు

భారత్​లో సర్వర్లను నిలిపివేస్తున్నట్లు పబ్​జీ మొబైల్ ప్రకటించింది. ఈ మేరకు అక్టోబర్ 30 నుంచి పబ్​జీ మొబైల్​ గేమ్​కు సంబంధించి అన్ని సేవలు నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 2న పబ్​జీ సహా 118 చైనా యాప్​లను భారత్​లో నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నతర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

pubg will disappear completely in India
పబ్​జీ సర్వర్లు నిలిపివేత

By

Published : Oct 30, 2020, 12:51 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

అంతర్గత భద్రతా కారణాలతో దేశంలో నిషేధాన్ని ఎదుర్కొంటున్న పబ్​జీ మొబైల్ గేమ్ కీలక ప్రకటన చేసింది. శుక్రవారం (అక్టోబర్ 30) నుంచి దేశంలో పబ్​జీ సర్వర్లు నిలిపేస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వర్లను చైనా కంపెనీ అయిన టెన్సెంట్​ గేమ్స్ నిర్వహిస్తోంది.

పబ్​జీ గేమ్​ను బ్యాన్ చేస్తూ సెప్టెంబర్ 2న ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. దాదాపు రెండు నెలల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంటోంది.

సర్వర్లు నిలిపేస్తే ఏమౌతుంది?

ప్రభుత్వం బ్యాన్ చేశాక.. ప్లేస్టోర్, యాప్​ స్టోర్లు తమ ప్లాట్​ఫాం​ నుంచి పబ్​జీని తొలగించాయి. దీనితో కొత్తగా పబ్​జీ మొబైల్​ గేమ్​ను యూజర్లు డౌన్​లోడ్ చేసుకునేందుకు వీలు లేకుండా పోయింది. కానీ.. అప్పటికే డౌన్​లోడ్ చేసుకున్న వారు మాత్రం గేమ్ ఆడేందుకు అవకాశం ఉండేది.

పబ్​జీ తాజాగా తీసుకున్న సర్వర్ల నిలిపివేత నిర్ణయంతో.. ఇప్పటికే డౌన్​లోడ్ చేసుకున్న యూజర్లు కూడా గేమ్​ను ఆడేందుకు వీలు లేదు.

ఇదీ చూడండి:118 చైనా యాప్​లపై మరింత సమాచారం ఇక్కడ చూడండి

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details