సుదూర గ్రహశకలానికి సంబంధించిన నమూనాలతో కూడిన క్యాప్సూల్ జపాన్ చేతికి చేరింది. దీనిపై పరిశోధనలు జరిపి.. సౌర కుటుంబం, భూమి పుట్టుక గురించి మరిన్ని వివరాలను కనుగొనాలని భావిస్తోంది ఆ దేశం.
భూమికి 30 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న రియూగు అనే గ్రహశకలం నుంచి ఏడాది కిందట ఈ నమూనాలను హయబుసా-2 సేకరించింది. శనివారం భూమికి 2.2 లక్షల కిలోమీటర్ల ఎత్తులో ఉండగా.. క్యాప్సూల్‌ను హయబుసా-2 విడిచిపెట్టింది. అది ఆస్ట్రేలియా గడ్డ మీద పడింది. ఆ క్యాప్సూల్నే జపాన్‌కు అందించింది ఆస్ట్రేలియా.