తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

'జోకర్​'తో జరభద్రం- లేదంటే ఖాతా ఖాళీ!

సైబర్ నేరాలలో 'జోకర్' ట్రెండ్ నడుస్తోంది. ఎవరికీ తెలియకుండా ఫోన్లు, కంప్యూటర్లలోకి చొరబడి సమచారాన్ని చాకచక్యంగా తస్కరిస్తోంది. ఈ వివరాలను నేరుగా తీసుకెళ్లి సైబర్ కేటుగాళ్ల చేతిలో పెడుతోంది. కొత్తగా వచ్చిన ఈ 'జోకర్' ఏంటి? దీని నుంచి ఎలా కాపాడుకోవాలి?

joker
'జోకర్​'తో జరభద్రం- లేదంటే ఖాతా ఖాళీ!

By

Published : Jul 23, 2020, 8:30 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

కరోనా కాలంలో ఆన్​లైన్ లావాదేవీల సంఖ్య బాగా పెరిగిపోయింది. కావాల్సిన సరకులన్నీ ఈ-కామర్స్​ వేదికల ద్వారానే ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సైబర్​ నేరగాళ్లు సైతం తమ బుర్రలకు పదును పెడుతున్నారు. కొత్త కొత్త మాల్​వేర్​లతో వినియోగదారులపై దాడులకు ప్రయత్నిస్తున్నారు.

అంకూర్ పురానిక్, సైబర్ భద్రతా నిపుణుడు

ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెచ్చుమీరిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్తగా జోకర్ అనే మాల్​వేర్​ను ఉపయోగిస్తున్నట్లు మహారాష్ట్ర సైబర్ సెల్ దర్యాప్తులో వెల్లడైంది. ఫోన్లు, కంప్యూటర్లలోకి చొరబడి కీలకమైన సమచారాన్ని జోకర్ చోరీచేస్తోందని సైబర్ డిపార్ట్​మెంట్ హెడ్ యశస్వీ యాదవ్ తెలిపారు. మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ సమాచారాన్ని తస్కరించి సైబర్ నేరగాళ్ల చేతిలో పెడుతోందని స్పష్టం చేశారు.

'జోకర్​'తో జరభద్రం- లేదంటే ఖాతా ఖాళీ!

ఇదీ చదవండి-ఆ యాప్స్​లో 'జోకర్​' మాల్​వేర్- దొరికినంత దోచేస్తోంది​!

మనకు తెలియకుండానే జోకర్​ ఫోన్లలోకి ప్రవేశిస్తుంది. ఆన్​లైన్ లావాదేవీల సమాచారాన్ని సేకరిస్తుంది. ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు దొంగలిస్తుంది. చివరగా ఖాతాను లూఠీ చేస్తుంది.

ఇదీ చూడండి: 'టెలికాం రంగంలో స్వయం సమృద్ధతే లక్ష్యం'

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details