ప్రస్తుతం ప్రతి ఫోన్‌లో తప్పనిసరిగా ఉండే యాప్‌లలో ట్రూకాలర్ కూడా ఒకటి. దీని సహాయంతో తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చినా.. ఎవరనేది సులభంగా తెలిసిపోతుంది. అలానే స్పామ్ కాల్స్‌ని బ్లాక్ చెయ్యొచ్చు. అయితే ఇది థర్డ్ పార్టీ కావడం వల్ల యూజర్స్ డేటాపై అప్పుడప్పుడు సందేహాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు చెక్ పెడుతూ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ట్రూకాలర్ తరహా ఫీచర్స్‌తో తన 'ఫోన్ యాప్'లో మార్పులు చేస్తుందట. త్వరలోనే ఈ యాప్‌ని యూజర్స్‌కి అందుబాటులో తీసురానున్నట్లు టెక్ వర్గాలు తెలిపాయి.
యాప్ విశేషాలు..
ఫోన్ అనే పేరు కాకుండా 'గూగుల్ కాల్' పేరుతో తీసుకొస్తున్న ఈ యాప్‌లో ఫోన్ చేసే వ్యక్తి పేరు తెలుస్తుంది. అంతేకాకుండా స్పామ్ కాల్స్‌ని నిరోధించవచ్చట. ఇవే కాకుండా మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్ గూగుల్ కాల్‌లో ఉంటాయని సమాచారం.
ఇప్పటి వరకు గూగుల్ పిక్సెల్ ఫోన్ యూజర్స్‌కి మాత్రమే పరిమితమైన ఫోన్ యాప్‌ని ఇటీవల అన్ని రకాల ఫోన్ యూజర్స్‌కి ఉపయోగించొచ్చని గూగుల్ ప్రకటించింది. అలానే యాప్‌లో కొత్తగా కాలర్ ఐడీ ఫీచర్‌ను జోడించారు. దీనితో కాల్ వచ్చినప్పుడు కాలర్ పేరు, ఫోన్ నంబర్ చదివి వినిపిస్తుంది.30 రోజుల తర్వాత పాత కాల్ స్క్రీన్ రికార్డింగ్‌లు వాటంతటవే డిలీట్ అయ్యే ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. తాజాగా ఫోన్ యాప్ పేరు మార్చి కొత్త ఫీచర్స్‌తో కాల్ యాప్‌తో యూజర్స్‌కి మరిన్ని మెరుగైన సేవలు అందించాలని గూగుల్ భావిస్తోంది.
ఇదీ చూడండి:నకిలీ రెడ్మీ ఉత్పత్తులను జప్తు చేసిన పోలీసులు