ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ యాప్ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' భారత్‌లో మొబైల్ ఎడిషన్ ప్లాన్లను ఆవిష్కరించింది. దీని ప్రారంభ ధర రూ.89గా నిర్ణయించింది. నెట్‌ఫ్లిక్స్ సహా ఇతర స్ట్రీమింగ్ యాప్‌ల నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ భాగస్వామ్యంతో ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించింది అమెజాన్ ప్రైమ్ వీడియో.
అమెజాన్‌కు ప్రధాన పోటీదారు అయిన నెట్‌ఫ్లిక్స్ గత ఏడాదే భారత్‌లో రూ.199 ధరతో మొబైల్ ప్లాన్‌ను పరిచయం చేసింది.
మొబైల్ ఎడిషన్ ప్లాన్ వివరాలు..
మొబైల్ ఎడిషన్ తీసుకుంటే ఒకసారి ఒక యూజర్ మాత్రమే వీడియో స్ట్రీమ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఎస్డీ క్వాలిటీలోనే వీడియోలు స్ట్రీమ్ అవుతాయి.
ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌ను ఉపయోగించి.. అమెజాన్ ప్రైమ్‌కు సైన్అప్ అయితే.. వాళ్లు 30 రోజుల పాటు ఉచితంగా వీడియోలు చూడొచ్చు. 30 రోజుల తర్వాత వీడియో స్ట్రీమ్ చేసేందుకు రూ.89 చెల్లించాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. దీనితో పాటు 6 జీబీ డేటా కూడా లభిస్తుంది.
ఒకరికంటే ఎక్కువ యూజర్లు వాడేందుకు వీలుగా, స్మార్ట్ టీవీ లాంటి వాటిలో హెచ్డీ క్వాలిటీ వీడియో స్ట్రీమ్ చేయాలనుకుంటే.. వారికి రూ.131తో, రూ.349 (ప్యాక్)తో ప్రత్యేక ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. వీటి వ్యాలిడిటీ 28 రోజులు.
కొత్త ప్లాన్లు ఆవిష్కరించినా.. రూ.999 వార్షిక, రూ.129 నెలవారీ ప్లాన్లు కొనసాగుతాయని అమెజాన్ ప్రైమ్ వీడియో స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:వాట్సాప్ వద్దనుకుంటే.. ఈ యాప్‌లు ట్రై చేయండి!