తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

వాట్సాప్‌లో 'న్యూఇయర్‌' గిఫ్ట్‌.. నిజమెంత?

cyber crime: సైబర్‌ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రోజుకో కొత్త తరహాలో కేటుగాళ్లు... సమాచారాన్ని దొంగలిస్తున్నారు. కొత్త ఏడాది వేడుకలను వారికి అనువుగా మార్చుకొని.. వాట్సాప్​ లింక్​ల రూపంలో డేటా చోరీలకు పాల్పడుతున్నారు.

whatsapp
వాట్సాప్‌

By

Published : Jan 1, 2022, 7:32 AM IST

cyber crime: కొత్త ఏడాది వేళ సైబర్‌ నేరగాళ్లు నయా మోసాలకు తెరలేపారు. న్యూఇయర్‌ గిఫ్ట్‌ పేరిట లింక్‌లు పెట్టి వ్యక్తిగత, బ్యాంక్‌ వివరాల చౌర్యానికి పాల్పడుతున్నారు. ఈ తరహా మెసేజులు వాట్సాప్‌లో ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ లింక్‌ల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మోసం చేసెదిలా..?

వాట్సాప్‌లో నడుస్తున్న కొత్త స్కామ్‌ పేరు Rediroff.ru. దీని ద్వారా కొత్త ఏడాదిలో ఖరీదైన బహుమతులంటూ ముందుగా వాట్సాప్‌లో లింక్‌లు వస్తున్నాయి. ఈ లింక్‌ ఓపెన్‌ చేయగానే ఓ చిన్న సర్వే నిర్వహించి బహుమతి కోసం సైబర్‌ నేరగాళ్లు మరో కొత్త వెబ్‌పేజీకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీతో పాటు బ్యాంక్‌ వివరాలను నమోదు చేయమని చెప్పి.. మీ బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేస్తారు. లేదంటే సమాచారాన్ని దొంగలిస్తారు. వీటితో పాటే పలువురు దుండగులు 'Excuse me, who are you', 'I found you on my contact list' అంటూ మెసేజ్‌లు పెట్టి స్కామ్‌లు చేస్తున్నారు.

ఇవి గుర్తుంచుకోండి..

  • అపరిచిత వ్యక్తుల నుంచి ఇటువంటి లింక్‌లు వస్తే ముందుగా అది స్కామ్‌ అని అర్థం చేసుకోండి.
  • ఈ లింక్‌లు క్లిక్‌ చేయడం ద్వారా రిమోట్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ అయ్యే ప్రమాదం ఉంది.
  • తద్వారా మీ డేటాను దుండగులు ఈజీగా యాక్సెస్‌ చేస్తారు.
  • మరీ ముఖ్యంగా మీకు వచ్చిన లింక్‌ ఓసారి గమనించండి. ఆ లింక్‌ URLలో.ru అని ఉంటే ఆ మెసేజ్‌ పంపిన వ్యక్తిని వెంటనే బ్లాక్‌ చేయండి. లింక్‌ను క్లిక్‌ చేయొద్దు.

ఇదీ చూడండి:'పవర్​ సాకెట్​లో కాయిన్​ పెట్టు'.. చిన్నారికి అలెక్సా ఛాలెంజ్.. చివరకు...

ABOUT THE AUTHOR

...view details