తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

How To Track Lost Phone : మీ ఫోన్ పోయిందా?.. క్షణాల్లో కనిపెట్టేయొచ్చు ఇలా! - Find Lost Phone Apps

How To Track Lost Phone : మీ మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే ఇకపై నో టెన్షన్.. ఇకపై క్షణాల్లో అదెక్కడ ఉందో ఇట్టే కనిపెట్టవచ్చు. దీని కోసం కేంద్రం ఒక ప్రత్యేక పోర్టల్‌ను తీసుకురానుంది. మరి ఆ పోర్టల్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Sanchar Saathi Portal
Sanchar Saathi

By

Published : May 14, 2023, 3:36 PM IST

How To Track Lost Phone : ఇకపై మీ మొబైల్ ఫోన్ కనిపించలేదని కంగారుపడాల్సిన అవసరం లేదు.. పోయిందని బాధ పడాల్సిన పని లేదు.. మీ ఫోన్‌ ఎక్కడ ఉన్నా క్షణాల్లో అదెక్కడ ఉందో ఇట్టే కనిపెట్టేయొచ్చు. దీని కోసం కేంద్రం ఒక ప్రత్యేకమైన పోర్టల్‌ను రూపొందించింది. దేశవ్యాప్తంగా ఈ పోర్టల్ సేవలను మే 17 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ 'సంచార్ సాథీ' అనే వెబ్​ పోర్టల్‌ను సెంటర్ ఫర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ - CDOT రూపొందించింది. ముంబయి, దిల్లీ, కర్ణాటక,ఈశాన్య రాష్ట్రాలలో సహా కొన్ని టెలికాం సర్కిల్‌లలో ఇప్పటికే CEIR సిస్టమ్‌ను CDOT అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది.

Sanchar Saathi Portal : కాగా, ఇప్పటివరకు ఈ పోర్టల్ సాయంతో 4 లక్షల 70 వేల మిస్సింగ్ మొబైల్స్​ను బ్లాక్ చేశారు. 2 లక్షల 40 వేల ఫోన్లను ట్రాక్ చేశారు. 8 వేల మొబైళ్లను రికవరీ చేశారు. ఈ నెల 17 నుంచి దేశం అంతటా వీటి సేవలు అమలు చేస్తామని అంతే కాకుండా దీని ద్వారా ప్రజలు పోగొట్టుకున్న తమ మొబైల్ ఫోన్‌లను బ్లాక్ చేసేందుకు, అలాగే ట్రాక్ చేసేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

Find Lost Phone Apps : అయితే ఇందుకోసం ఫోన్‌ పోగొట్టుకున్న వినియోగదారుడు ముందుగా... సంచార్ సాథీ వైబ్‌ సైట్‌లోకి లాగ్​ ఇన్​ అయ్యి సంబంధిచ అప్లికేషన్‌ను నింపాలి. అందులో ఫోన్ నంబరు, IMEI నంబరు, ఫోన్ వివరాలు, ఫోన్‌ పోగొట్టుకున్న ప్రాంతం ఇలా మొదలైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత తమ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ నంబర్ కోసం నకిలీ SIM కార్డ్‌ను తీసుకోవాలి. ఇక ఆప్లికేషన్‌ సమర్పించిన తర్వాత, వినియోగదారుడికి ఒక IDని ఇస్తారు. ఇది తమ అభ్యర్థన స్థితిని తెలుసుకోవడానికి, భవిష్యత్తులో IMEIని అన్‌బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

మరోవైపు ఈ పోర్టల్‌లో అన్ని టెలికాం నెట్‌వర్క్‌ల్లోని ఫోన్లకు సంబంధించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఉంచారు. దీని వల్ల వాటి వినియోగంపై నిఘా పెట్టవచ్చు. భారత్‌లో మొబైల్ ఫోన్లను విక్రయించే ముందు వాటి IMEI- 15 అంకెల నంబర్​ను బహిర్గతం చేయడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీని ద్వారా ఆమోదించిన IMEI నంబర్‌లకు అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లకు సమాచారాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇవి తమ నెట్‌వర్క్‌లో ఏదైనా అనధికార మొబైల్ ఫోన్‌ల ప్రవేశాన్ని గుర్తిస్తాయి. టెలికాం ఆపరేటర్లు, ఈ CEIR సిస్టమ్ IMEI నంబర్, దానికి లింక్ చేసిన మొబైల్ నంబర్‌లో యాక్సెస్‌ కలిగి ఉంటుంది. ఈ CEIR సిస్టమ్‌ ద్వారా మీరు పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన మొబైల్‌లను ట్రాక్ చేయవచ్చు.

ABOUT THE AUTHOR

...view details