అల్ట్రా-ప్రీమియం ఉత్పత్తుల జాబితాలో కొత్త ప్రొజెక్టర్‌ను శాంసంగ్ విడుదల చేసింది. ది ప్రీమియర్ పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రొజెక్టర్ సాయంతో యూజర్స్ థియేటర్ అనుభూతిని ఇల్లు, ఆఫీస్‌లలోనే ఆస్వాదించవచ్చని తెలిపింది. చిన్నపాటి సూట్‌కేస్ తరహాలో ఉండే ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడైనా సులభంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ది ప్రీమియర్‌ను ఎల్‌ఎస్‌పీ9టీ, ఎల్‌ఎస్‌పీ7టీ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఇతర ప్రొజెక్టర్ల మాదిరిగా ది ప్రీమియర్‌ను ఎత్తులో దూరంగా అమర్చాల్సిన అవసరం లేదు. మనం వీడియో చూడాలనుకుంటున్న గోడకి కింది భాగంలో 11.3 సెంటీ మీటర్ల దూరంలో ఉంచితే ఎల్‌ఎస్‌పీ9టీ వేరియంట్ 100-అంగుళాల తెరను, 23.8 సెంటీ మీటర్ల దూరంలో ఉంచితే 130-అంగుళాల భారీ తెరను చూపిస్తుంది. ఇక ఎల్‌ఎస్‌పీ7టీ వేరియంట్ 30.3 సెంటీమీటర్ల దూరం నుంచి 120-అంగుళాల తెరను ప్రొజెక్ట్ చేస్తుంది. ఇవి రెండు లేజర్-పవర్ 4కే పిక్చర్ రిజల్యూషన్ క్వాలిటీని అందిస్తాయి. ప్రపంచంలోనే ట్రిపుల్ లేజర్ టెక్నాలజీతో వస్తున్న తొలి హెచ్‌డీఆర్10+ ప్రొజెక్టర్లు ఇవేనని శాంసంగ్ తెలిపింది.
ETV Bharat / science-and-technology
థియేటర్ లాంటి అనుభూతి ఇకపై ఇంట్లోనే - శాంసంగ్ ఎస్ఎల్పీ9టీ
ది ప్రీమియర్ పేరుతో రెండు సరికొత్త ప్రొజెక్టర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది శాంసంగ్. దీంతో యూజర్స్ థియేటర్ అనుభూతిని ఆస్వాదించే అవకాశముంది. చిన్నపాటి సూట్‌కేస్ తరహాలో ఉండే ఈ ప్రొజెక్టర్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు.
వీటిలో ఫిల్మ్‌మేకర్ మోడ్ ఉంటుంది. దీని సాయంతో యూజర్ ఓటీటీలు, యూట్యూబ్‌లోని వీడియోలను సులభంగా యాక్సెస్ చేయగలరు. వాయిస్ రికగ్నిషన్‌ని సపోర్ట్ చేస్తుంది. ప్లే టాప్ వ్యూ ఫీచర్‌తో స్మార్ట్ ఫోన్‌లోని కంటెంట్‌ని కూడా ప్రొజెక్ట్ చెయ్యొచ్చు. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో ప్రత్యేకంగా గేమింగ్ మోడ్ కూడా ఉంది. ది ప్రీమియర్‌లో రెండు 40 వాట్ ఇన్-బిల్ట్ స్పీకర్‌లు, వూఫర్‌లు ఇస్తున్నారు. ఇది ఆకోస్టిక్ బీమ్ సరౌండ్ సౌండ్ అనుభూతిని అందిస్తాయి. దీంతో ప్రొజెక్టర్ ద్వారా వీడియోలు చూసేప్పుడు ప్రత్యేకంగా ఆడియో డివైజ్‌లు కనెక్ట్ చేయాల్సిన అవసరంలేదు. ఎల్‌ఎస్‌పీ9టీ వేరియంట్ ధర రూ.6.29 లక్షలు కాగా, ఎల్‌ఎస్‌పీ7టీ ధర రూ.3.89 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. శాంసంగ్ వెబ్‌సైట్, రిటైల్ స్టోర్ల నుంచి వీటిని కొనుగోలు చెయ్యొచ్చు.
ఇదీ చదవండి:ఇన్‌స్టాలో అలాంటి కామెంట్లకు ఇకపై చెక్