Samsung Galaxy Unpacked Event : దక్షిణ కొరియా టెక్ కంపెనీ శాంసంగ్ తన సరికొత్త ఫ్లాగ్షిప్ ఫోల్డబుల్ ఫోన్లను నేడు అన్ప్యాక్ చేసింది. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5, జెడ్ ఫోల్ట్ 5 పేర్లతో తీసుకొచ్చిన ఈ మడతపెట్టే ఫోన్లలో అదిరిపోయే స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది.
బిగ్ స్ట్రాటజీ
సాధారణంగా టెక్ కంపెనీలు తమ కొత్త ప్రొడక్టులను లాంఛ్ చేసేందుకు ఇలాంటి స్పెషల్ ఈవెంట్లను నిర్వహిస్తూ ఉంటాయి. దీని వెనుక పెద్ద స్ట్రేటజీ ఉంటుంది. ఈ భారీ ఈవెంట్ల ద్వారా టెక్ కంపెనీలు.. తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరువ చేసే స్ట్రాటజీని ఫాలో అవుతుంటాయి.
మడత ఫోన్లు పరిచయం
Samsung flagship phones : శాంసంగ్ దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్‌ను నిర్వహించింది. దీని ద్వారా Galaxy Z Flip 5, Z Fold 5 అనే రెండు మడతపెట్టే ఫోన్లను పరిచయం చేసింది. ఈ ఫ్లాగ్షిప్ ఫోన్లు గతంలో వచ్చిన శాంసంగ్ ఫోన్ల కంటే చాలా ఇంప్రూవ్డ్ వెర్షన్స్ అని చెప్పొచ్చు.
అదిరిపోయే లుక్స్‌తో... శాంసంగ్ మడత ఫోన్ శాంసంగ్ ఈ లేటెస్ట్ గెలాక్సీ ఫోన్లలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్‌ను పొందుపరిచింది. అలాగే ఈ ఫోన్.. బ్లూ, గ్రే, ఐసీ బ్లూ, ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, ఎల్లో, మింట్, గ్రాఫైట్, లావెండర్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా శాంసంగ్ ఈ ఫోన్లతో పాటు ఎస్-పెన్ను కూడా అందిస్తోంది. దీనితో మీరు ఫోన్‌పై రాయవచ్చు, బొమ్మలు గీయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 సూపర్.. గెలాక్సీ వాచ్!
Samsung galaxy watch latest model : శాంసంగ్ ఈ అన్ప్యాక్డ్ ఈవెంట్లో గెలాక్సీ వాచ్ 6, వాచ్ 6 క్లాసిక్ అనే రెండు స్మార్ట్ వాచ్‌లను కూడా పరిచయం చేసింది. ఇవి చాలా పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉండి, యూజర్లకు మంచి ఎక్సీపీరియన్స్ ఇచ్చేలా ఉన్నాయి.
శాంసంగ్ గెలాక్సీ వాచ్ 6 శాంసంగ్ గెలాక్సీ వాచ్‌లో మరో కీలకమైన అప్డేట్ తీసుకొచ్చింది. జస్ట్ ఒక్క క్లిక్‌తో ఫొటోలు, వీడియోలను.. గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 - గెలాక్సీ వాచ్6 మధ్య స్నాప్ చేసుకోవచ్చు. అలాగే గెలాక్సీ వాచ్ 6లోని ప్రాసెసర్ కూడా అప్డేట్ చేశారు. అందువల్ల ఇది పాత గెలాక్సీ వాచ్‌ల కంటే దాదాపు 18 శాతం వేగంగా పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్ మీ నిద్ర అలవాట్లను కూడా ట్రాక్ చేస్తుందని స్పష్టం చేసింది.
శాంసంగ్ వాట్ 6 క్లాసిక్ సరికొత్త శాంసంగ్ ట్యాబ్స్ !
Samsung Galaxy Tab S Series : శాంసంగ్ ఇదే ఈవెంట్లో గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సరీస్‌కు చెందిన ట్యాబ్ ఎస్9, ఎస్9 ప్లస్, ఎస్9 ఆల్ట్రా.. కూడా పరిచయం చేసింది. గెలాక్సీ ట్యాబ్ ఎస్9 సిరీస్.. డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ డిస్ప్లేతో తీసుకొస్తున్నట్లు శాంసంగ్ తెలిపింది. ఇది యూజర్లకు అన్‌బీటబుల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని పేర్కొంది. అలాగే ఈ ట్యాబ్‌లను రెండు నేచర్ ఇన్స్పైర్డ్ కలర్స్‌తో తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది.
శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్ 9 లైవ్ ఈవెంట్‌కు మందే లీక్
Samsung event leaks : శాంసంగ్ అన్ప్యాక్డ్ లైవ్ ఈవెంట్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు దాని ప్రొడక్ట్ వెబ్‌పేజ్ లీక్ అయ్యింది. దానిలో గెలాక్సీ ఫ్లిప్ 5, జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ వాచ్ 6, గెలాక్సీ ట్యాబ్ ఎస్9 చిత్రాలు కనిపించాయి.
శాంసంగ్ జెడ్ ఫ్లిప్ 5 పిక్స్