Samsung Galaxy S23: శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ జెడ్ 4 పోల్డ్.. మడత ఫోన్లను ఈ నెల ఆగష్టు 16 న మార్కెట్లో విడుదల చేశాక అందరి దృష్టి.. తరువాత వచ్చే గెలాక్సీ మోడల్‌పైనే ఉంది. వచ్చే సంవత్సరం మార్కెట్లోని రానున్న గెలాక్సీ ఎస్ 23 ఫోన్‌లో 200ఎంపీ కెమెరా ఉన్నట్లు 'కొరియా ఐటీ న్యూస్' తెలిపింది.
ఆ వార్త ప్రకారం ఫోన్‌లో 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్ ఉంటుందని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఎక్స్‌పీరియన్స్ విభాగం ధృవీకరించింది. 200ఎంపీ కెమెరా ఉన్న ఏకైక ఫోన్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా అని ప్రకటించింది. అయితే, అధికారికంగా దీనిపై శాంసంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలోనూ ఇదే తరహా వార్తలు బయటకు వచ్చాయి. వేటిపైనా సంస్థ స్పందించలేదు.