తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Russian Couple Married Hindu Tradition : హరిద్వార్​లో 3 రష్యన్​ జంటల పెళ్లి.. యాత్ర కోసం వచ్చి.. హిందూ ఆచారాలు మెచ్చి.. - Russians spiritual tour to india

Russian Couple Married Hindu Tradition : ఉత్తరాఖండ్ హరిద్వార్​లో మూడు రష్యన్ జంటలు.. హిందూ ఆచారాల ప్రకారం పెళ్లి చేసుకున్నాయి. ఈ వివాహానికి మరికొంత మంది రష్యా పౌరులు హాజరై.. వేడుకల్లో సందడి చేశారు.

Russian Couple Married In Hindu Tradition
Russian Couple Married In Hindu Tradition

By ETV Bharat Telugu Team

Published : Oct 5, 2023, 10:50 AM IST

Updated : Oct 5, 2023, 11:47 AM IST

Russian Couple Married Hindu Tradition :ఉత్తరాఖండ్ హరిద్వార్​లోని అఖండ్ పరమానంద్ ఆశ్రమం​లో రష్యాకు చెందిన మూడు జంటలు హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నాయి. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతగానో నచ్చి.. హిందు ఆచారంలో పెళ్లి చేసుకున్నట్లు వారు చెప్పారు. అలాగే వీరి వివాహానికి.. మరికొంత మంది రష్యా పౌరులు కూడా హాజరయ్యారు. ఇంతకీ వీరి కథేంటంటే?

50 మంది రష్యా పౌరులు ఆధ్యాత్మిక యాత్ర కోసం భారత్​కు వచ్చారు. యాత్రలో భాగంగా వారు ఉత్తరాఖండ్ హరిద్వార్​ చేరుకున్నారు. ఈ క్రమంలో వారికి భారత ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు ఎంతో నచ్చాయి. దీంతో రష్యా పౌరుల బృందంలోని 3 జంటలు అక్కడే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాయి. దీంతో బుధవారం పరమానంద్ ఆశ్రమంలో పెళ్లి చేసుకున్నారు.

దండలు మార్చుకుంటున్న రష్యన్ కపుల్
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్న రష్యన్లు

ఘనంగా ఊరేగింపు..పెళ్లి తంతు కంటే ముందు ఘనంగా ఊరేగింపు కార్యక్రమం జరిగింది. ఈ పెళ్లిలో వధూవరులు భారతీయ ట్రెడిషనల్​ లుక్​లో కనిపించారు. వరులు షేర్వానీ ధరించగా.. వధువులు లెహంగాల్లో కనిపించి ఆకట్టుకున్నారు. ఇక పెళ్లి జంటలతో రష్యా పౌరులందరూ.. ఉత్తరాఖండ్ ఫేమస్ డ్రమ్స్​, సంప్రదాయ వాద్యాలకు, హిందీ పాటలకు హుషారుగా డ్యాన్స్​లు చేస్తూ.. కరెన్సీ నోట్లను వెదజల్లుతు ఎంజాయ్ చేశారు. తర్వాత ఆశ్రమంలో ఉన్న శివాలయాన్ని సందర్శించారు. భగవాన్ శివుడి దర్శనం అనంతరం.. ఆశ్రమం గురూజీ పరామనంద్ గిరి మహారాజ్ పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఒకరినొకరు పూల దండలు మార్చుకొని.. వేదమంత్రాల మధ్య మండపంలో ఏడు అడుగులు వేశారు.

పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తున్న రష్యన్లు
ఊరేగింపులో రష్యన్ జంటలు
పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తున్న రష్యన్లు

"విదేశీ పాశ్చాత్య సంస్కృతితో విసుగు చెంది.. హిందూ సంప్రదాయాల ప్రకారం వీరు పెళ్లి చేసుకున్నారు. అంతేకాకుండా ఏడు జన్మలపాటు కలిసి ఉంటామంటూ ఒకరికొకరు ప్రమాణం చేశారు. వీరితో పాటు ఇక్కడికి వచ్చిన రష్యాన్ పౌరులందరూ ఈ వివాహ వేడుకను ఎంజాయ్ చేశారు. ఇంతకుముందు కూడా ఇక్కడ అనేక రష్యాన్ జంటలు భారతీయ సంస్కృతి ప్రకారం వివాహం చేసుకున్నాయి" అని ఆశ్రమం గురూజీ పరమానంద్ గిరి వివరించారు.

ఆశ్రమం గురూజీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ

foreign Girl Marries Indian Guy: దేశాలు వేరైనా.. ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు

మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన భద్రాద్రి అబ్బాయి.. ఫ్రాన్స్​ అమ్మాయి

Last Updated : Oct 5, 2023, 11:47 AM IST

ABOUT THE AUTHOR

...view details