అమెరికాకు చెందిన స్టాక్ ట్రేడింగ్ యాప్ రాబిన్హుడ్పై (Robinhood News) సైబర్ నేరగాళ్లు దాడికి పాల్పడ్డారు. ఈనెల 3న జరిగిన ఈ ఘటనలో 50 లక్షల మంది కస్టమర్ల ఈమెయిల్స్‌తో పాటు సంస్థలో పెట్టుబడులు పెట్టిన మరో 20 లక్షల మంది పేర్లు కూడా హ్యాకర్ల సేకరించినట్లు రాబిన్‌హుడ్ సంస్థ (Robinhood News) చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) క్యాలెబ్ సీమా వెల్లడించారు. వీరిలో 310 యూజర్ల వ్యక్తిగత వివరాలు కూడా హ్యాకర్ల చేతికి వెళ్లినట్లు తెలిపారు.
ఎలాంటి నష్టం లేదు..
ఈ దాడి వల్ల ఎవరికీ ఎలాంటి ఆర్థిక నష్టం కలగలేదన్నారు రాబిన్‌హుడ్ సంస్థ (Robinhood News) సీఎస్ఓ. బ్యాంక్ ఖాతా, సోషల్ సెక్యూరిటీ నంబర్స్, డెబిట్ కార్డు వివరాలు గోప్యంగానే ఉన్నాయని స్పష్టం చేశారు.
రాబిన్‌హుడ్ ఉద్యోగిని నమ్మించి..
హ్యాకర్లు 'సోషల్ ఇంజినీరింగ్' అనే పద్ధతిని ఉపయోగించి తమ సంస్థపై సైబర్ దాడికి పాల్పడినట్లు సీఎస్ఓ వెల్లడించారు. తమ సంస్థ కస్టమర్ కేర్‌కు కాల్ చేసిన నిందితులు.. రాబిన్‌హుడ్ సంస్థకు చెందిన అధికారిని అంటూ ఉద్యోగిని నమ్మించారని సీమా తెలిపారు. కస్టమర్ సపోర్ట్ కంప్యూటర్ సిస్టమ్‌ను హ్యాక్ చేయడం ద్వారా నిందితులు వివరాలు సేకరించారని పేర్కొన్నారు.