Cancer Medicine: క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందును కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అంతేకాదు.. ఈ మందు తీసుకున్న బాధితుల్లో పూర్తిగా క్యాన్సర్ వ్యాధి నయం అయిపోయిందట. ఈ విషయాన్ని అమెరికా మీడియా వెల్లడించింది. అక్కడి శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ ప్రయోగం సక్సెస్ అయిందని పేర్కొంది. డోస్టర్లిమాబ్ పేరుతో పిలిచే మందును వేసుకుంటే రెక్టర్ క్యాన్సర్ నుంచి విముక్తి కలుగుతుందని వెల్లడైంది. 18 మందిపై చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాలు ఇచ్చినట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ మందు తీసుకుంటే ఇక మరే చికిత్స అవసరం లేదని తెలిపారు.
ETV Bharat / science-and-technology
శాస్త్రవేత్తల ప్రయోగం సక్సెస్.. క్యాన్సర్‌ను ఖతం చేసే మందు రెడీ! - rectal cancer
Cancer Medicine: క్యాన్సర్.. ఈ జబ్బు వచ్చిన వారిలో ఎవరికైనా వ్యాధి నయమైందంటే అదో మిరాకిల్గానే భావిస్తారు. ఈ ప్రమాదకర వ్యాధికి చెక్ పెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నా ఎలాంటి ముందడుగు పడలేదు. కానీ చరిత్రలో తొలిసారిగా ఇప్పుడు కీలక పురోగతి లభించింది.
న్యూయార్క్‌కు చెందిన మెమోరియల్ స్లోయన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా ఈ పరిశోధన చేస్తున్నారు. రీసెర్చ్‌లో సత్ఫలితాలు రావడంపై శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడం చరిత్రలో తొలిసారని అన్నారు పరిశోధకులు డాక్టర్ లూయిస్ ఏ.డయాస్ జే. ఈ మందుతో కిమోథెరపీ, రేడియేషన్, సర్జరీ మొదలైన కష్టమైన చికిత్సలను నివారించొచ్చని పేర్కొన్నారు. క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 18 మంది బాధితులకు గత ఆరునెలల్లో ప్రతీమూడు వారాలకు ఓసారి ఈ డోస్టర్లిమాబ్ ఇచ్చామని వెల్లడించారు. ఆశ్చర్యకరంగా అందరికీ నయమైపోయినట్లు వివరించారు.
ఇదీ చూడండి :గ్రావిటీతో బ్యాటరీ! లిథియం అయాన్లకు చెక్