తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Remove Search Results From Google : గూగుల్​ సెర్చ్​లో మీ పర్సనల్ ఇన్ఫో వస్తోందా?.. డిలీట్​ చేయండిలా.. - గూగుల్​ సెర్చ్​ రిజల్ట్స్​ పేజీ

Remove Search Results From Google : గూగుల్​.. అందరికీ సుపరిచితమైన పదం. ఏ చిన్న సందేహం వచ్చినా అందరూ ముందుగా ఆశ్రయించేది దీని​నే. ఇదిలా ఉంటే గూగుల్​ సెర్చ్​లో మీ వ్యక్తిగత వివరాలు కూడా దర్శనమిస్తుంటాయి. అయితే అలా మన పర్సనల్​ డీటెయిల్స్​ను బహిరంగంగా అందరికీ అందుబాటులో ఉంచడం ప్రమాదకరమని సూచిస్తున్నారు నిపుణులు​. మరి వీటిని సెర్చ్​ రిజల్ట్స్​ నుంచి ఎలా తొలగించాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

Remove Search Results From Google In Telugu
Remove Search Results From Google Full Details

By

Published : Aug 18, 2023, 1:30 PM IST

Updated : Aug 18, 2023, 1:52 PM IST

Remove Search Results From Google : ఒక్కోసారి గూగుల్​ సెర్చ్ రిజల్ట్స్​లో మన వ్యక్తిగత సమాచారం కనిపిస్తుంటుంది. ఇందులో మన పేరు, ఇంటి అడ్రస్​, మొబైల్​ నంబర్​, పర్సనల్​ మెయిల్​ ఐడీ, ఫొటోలు లాంటివి ఉండవచ్చు. అయితే ఇలా బహిరంగంగా మన వ్యక్తిగత వివరాలను అందరికీ కనిపించేలా చేయడం ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు టెక్​ నిపుణులు. వీలైతే వాటిని ఎవరికీ కనిపించకుండా లేదా అందుబాటులో లేకుండా చేయడం ఉత్తమమని సూచిస్తున్నారు. అయితే ఇవి ఎప్పటికీ కనిపించకుండా సెర్చ్​ రిజల్ట్స్ నుంచి పూర్తిగా తొలగించవచ్చా? అనే ప్రశ్నకు సమాధానమే ఈ ఆర్టికల్​.

గూగుల్​ సెర్చ్​ రిజల్ట్స్​లో మన పర్సనల్​ ఇన్ఫోను తొలగించుకునే పరిష్కారం​ ఇదివరకే ఉన్నా.. అది పూర్తిగా తొలగిపోతుందో? లేదో? చెప్పలేని పరిస్థితి ఉండేది. అయితే తాజాగా గూగుల్​ తెచ్చిన ఓ సరికొత్త టూల్ ( Search Results Chrome )​తో ఆ సమస్యకు చెక్​ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఈ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రానప్పటికీ.. భవిష్యత్తులో ఇది అందరికీ ఉపయోగపడవచ్చని అంచనా వేస్తున్నారు.

సెర్చ్​ బార్​లో పబ్లిక్​గా కనిపించే మన వ్యక్తిగత వివరాలను కొందరు కేటుగాళ్లు సేకరించి మోసాలకూ పాల్పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు సైబర్​ నిపుణులు. దీనిని అరికట్టడంలో భాగంగానే వినియోగదారుల భద్రత కోసం గూగుల్​ ఎప్పటికప్పుడు సరికొత్త టూల్స్​, ఫీచర్స్​ను అందుబాటులోకి తెెస్తూ వస్తోంది. ఇవి మీరు గూగుల్​లో సెర్చ్​ చేసిన రిజల్ట్స్​ను పూర్తిగా డిలీట్​ చేయడంలో సహాయపడతాయి. వీటి సాయంతో మన వ్యక్తిగత సమాచారాన్ని అంతర్జాలం నుంచి సులువుగా తొలగించుకోవచ్చు ( How To Remove Google Search Results ). 2022లో కూడా గూగుల్​ ఈ సెర్చ్​ రిజల్ట్స్​ వ్యూ నియంత్రణకు సంబంధించి ప్రత్యేకంగా ఓ టూల్​ను తీసుకువచ్చింది. ఇది మన వ్యక్తిగత సమాచారానికి భద్రతను కల్పిస్తుంది.

Search Results Google :గతేడాది తెచ్చిన టూల్​ను మరింత మెరుగ్గా అప్​గ్రేడ్​ చేసింది గూగుల్​. దీనిని తాజాగా​​ గూగుల్​ సెర్చ్​ రిజల్ట్స్​కు అనుసంధానించారు. దీనితో రిజల్ట్స్​లో మీ వ్యక్తిగత వివరాలు ఇతర వ్యక్తులకు ఎప్పటికీ కనిపించకుండా చేయవచ్చు. పైగా మీ పర్సనల్​ వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్​ కూడా చేసుకోవచ్చు. అంతే కాకుండా మీ వ్యక్తిగత వివరాలు బహిరంగంగా సెర్చ్​ రిజల్ట్స్​లో కనిపించగానే మీకు పలు అలర్ట్​లను కూడా పంపిస్తుంది ఈ నయా టూల్​. అయితే దీనిని మీరు ఉపయోగించాలంటే.. కచ్చితంగా మీకు గూగుల్​ అకౌంట్​ ఉండాలి.

సెర్చ్​ రిజల్ట్స్​ డిలీట్​ ఇలా..

  • ముందుగా బ్రౌజర్​లో గూగుల్​ను ఓపెన్​ చేయండి.
  • సెర్చ్​బార్​లో మీ పేరు, ఇంటి చిరునామా లాంటి వ్యక్తిగత వివరాలను సెర్చ్​ చేయండి.
  • అప్పుడు మీకు సంబంధించిన కొన్ని సైట్స్​ లేదా వివరాలు డిస్​ప్లే అవుతాయి.
  • అనంతరం మీరు డిలీట్​ చేయాలనుకుంటున్న సెర్చ్ రిజల్ట్​ పక్కన ఉన్న మూడు చుక్కలపై క్లిక్​ చేయండి.
  • తరువాత కనబడే ఆప్షన్స్​ మెనూ నుంచి 'రిమూవ్​ రిజల్ట్​ను' సెలెక్ట్​ చేయండి.
  • అయితే మీరు ఆ రిజల్ట్​ను ఎందుకు తొలగించాలని అనుకుంటున్నారు అని గూగుల్​ మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు అందుకు గల కారణాన్ని తెలియజేసే ఐదు ఆప్షన్స్​లలో డిలీట్​కి గల కారణం ఉన్న ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • మీరు ఎంచుకున్న ఎంపిక ఆధారంగా మీరు అక్కడ కనిపించే ఇతర సూచనలను అనుసరించాల్సి ఉంటుంది.
  • అలా గూగుల్​ చెప్పే సూచనలను అనుసరించి మీరు డిలీట్​ చేయాలనుకుంటున్న సెర్చ్ రిజల్ట్​ను సులువుగా తొలగించవచ్చు.

Search Remove Results : మీరు చేసే ఈ తొలగింపు అభ్యర్థనను గూగుల్​ సెటప్​​ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. అలా మీరు చేసిన అభ్యర్థన అప్రూవ్​ అయిందా లేదా తిరస్కరణకు గురైందా అనేది కూడా మీ డాష్​బోర్డ్​లో తెలిసిపోతుంది. అయితే దీనికి కొన్ని రోజుల సమయం పట్టవచ్చు. మరోవైపు మీ అభ్యర్థనను గూగుల్​ ఆమోదిస్తుందనే గ్యారెంటీ కూడా ఉండదు.

ఈ సెర్చ్​ రిజల్ట్​ డిలీట్​ టూల్​కు సంబంధించి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. అవేంటంటే..

  • ఈ టూల్​ మీరు గూగుల్​లో సెర్చ్ చేసిన రిజల్ట్స్​ను మాత్రమే తొలగిస్తుంది. కానీ అప్పటికే ఎంట్రీ చేసి ఉన్న మీ వివరాలను మాత్రం అలానే ఉంచుతుంది.
  • మీరు ఒరిజినల్​ వెబ్​సైట్​ను లేదా ఇతర సెర్చ్ ఇంజిన్​లోకి వెళ్లి వెతికినా అప్పటికే ఎంటర్​ చేసి ఉన్న సెర్చ్​ రిజల్ట్స్​ మళ్లీ కనిపిస్తుంటాయి.
  • దీనిని మీరు పూర్తిగా డివైజ్​ నుంచి తొలగించాలనుకుంటే సంబంధిత వెబ్​సైట్​ ఓనర్​ను సంప్రదించాల్సి ఉంటుంది.
  • ప్రస్తుతానికి ఈ టూల్​ అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. పైగా ఇంగ్లిష్​లోనే దీనిని రూపొందించారు. అయినప్పటికీ VPN సాయంతో ఈ ఫీచర్​ను ఇతర దేశాల్లోనూ పరీక్షించగలుగుతున్నారు.
  • మీరు తొలగించాలని కోరే ప్రతి రిజల్ట్​ను గూగుల్​ వ్యక్తిగతంగా సమీక్షిస్తుంది. అంతే కాకుండా మీరు తొలగించాలనుకుంటున్న సెర్చ్ రిజల్ట్స్​ ఎంట్రీలు సంస్థ నిర్దేశించిన పాలసీ నిబంధనలను ఉల్లంఘించాయా? లేదా? అనేది కూడా చెక్​ చేస్తుంది.
  • ఒకవేళ వెబ్​సైట్​ ఓనర్​ ఇచ్చిన కీ-వర్డ్​ లేదా సెర్చ్​ రిజల్ట్ కంపెనీ నియమాలకు అనుగుణంగా ఉంటే గనుక.. మీరు తీసేయమని కోరే రిజల్ట్​ను డిలీట్​ చేయదు. అంటే మీ అభ్యర్థనను తిరస్కరిస్తుంది.

మొత్తంగా గూగుల్​ ప్రవేశపెట్టిన ఈ టూల్స్​ గనుక భవిష్యత్తులో అందిరికీ అందుబాటులోకి వస్తే.. సెర్చ్ రిజల్ట్స్​ను సులువుగా తొలగించుకోవచ్చు.

Last Updated : Aug 18, 2023, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details