వినియోగదారులకు జియో అదిరిపోయే ప్రీపెయిడ్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. రూ. 3,499కే ఏడాది పాటు అపరిమిత సేవలను అందిస్తున్నట్లు ప్రకటించింది. నిరతరం, ఉచిత వాయిస్ కాల్స్‌తో పాటు ప్రతిరోజూ 3జీబీ డేటా, 100 ఎస్ఎస్ఎమ్లు అందిస్తోంది. ఈ సాధారణ ఆఫర్‌తో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యురిటీ, జియో క్లౌడ్‌లను కూడా ఉచితంగా సబ్‌స్క్రైబ్ కావొచ్చు.
అంత మొత్తంలో ఒకేసారి చెల్లించలేమనుకునే వినియోగదారులకు నెలవారీగా రూ.349 ప్రీపెయిడ్ ఆఫర్‌ను అందిస్తోంది జియో. ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్‌కి ఉండే అన్ని లాభాలు నెలవారి ప్లాన్‌లో ఉన్నాయి. కానీ ఏడాదికి రూ.4,188 అవుతుంది. ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే రూ.689 సేవ్ చేసుకోవచ్చు.