షావోమి సబ్‌బ్రాండ్ రెడ్‌మీ రెండు కొత్త ల్యాప్‌టాప్‌లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ బుక్ ప్రో, రెడ్‌మీ బుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్ పేరుతో వీటిని తీసుకొచ్చింది. వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులు, ఇతర ప్రొఫెషనల్స్‌ను కోసం రెడ్‌మీ బుక్ ప్రో, ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని రెడ్‌మీ బుక్ ఈ-లెర్నింగ్ ఎడిషన్‌లు డిజైన్ చేసినట్లు రెడ్‌మీ ఒక ప్రకటనలో తెలిపింది. మరి ఈ ల్యాప్‌టాప్‌లలో ఎలాంటి ఫీచర్లున్నాయి? వీటి ధరెంత? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయో తెలుసుకుందాం.
రెడ్‌మీ బుక్ ప్రో (Redmi Book Pro)
ఇందులో 15.6-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే ఇస్తున్నారు. విండోస్ 10 ఓఎస్‌తో పనిచేస్తుంది. సిస్సర్ మెకానిజమ్ కీ బోర్డు ఇస్తున్నారు. దీని సాయంతో యూజర్ మరింత సౌకర్యవంతంగా, సులభంగా, వేగంగా టైప్ చెయ్యొచ్చు. అలానే ఈ ల్యాప్‌టాప్‌లో 100సెంటీమీటర్ ట్రాక్‌పాడ్ అమర్చారు. ఇది విండోస్ ప్రిసెషన్ డ్రైవర్స్, మల్టీ-టచ్ ఇన్‌పుట్స్‌ని సపోర్ట్ చేస్తుంది. ఇంటెల్ కోర్ ఐ5 11వ జనరేషన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 4.4 గిగాహెడ్జ్ స్పీడ్‌తో ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌ను అందిస్తుంది. 8జీబీ డీడీఆర్4 ర్యామ్ /512జీబీ ఎస్‌ఎస్‌డీ హార్డ్‌డిస్క్ ఇస్తున్నారు. బ్లూటూత్, వైఫై కనెక్టివిటీ, రెండు యూఎస్‌బీ 3.2 జెన్1, ఒక యూస్‌బీ 2.0, హెచ్‌డీఎమ్‌ఐ, గిగాబైట్ ఈథర్‌నెట్, 3.5 ఎమ్‌ఎమ్ ఆడియోజాక్ పోర్టులు ఉన్నాయి.
ఈ ల్యాప్‌టాప్ కేవలం 12 సెకన్లలో బూట్ అవుతుంది. అలానే 25 సెకన్లలో రీబూట్ అవుతుందని రెడ్‌మీ తెలిపింది. ఆన్‌లైన్ మీటింగ్, వీడియో కాల్స్ కోసం 720 పిక్సెల్ వెబ్ కెమెరా ఉంది. డ్యూయల్ మైక్రోఫోన్స్, డీటీఎస్ ఆడియోతో రెండు 2వాట్ స్పీకర్స్ ఉన్నాయి. రెడ్‌మీ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. 30 నిమిషాల్లో 50 శాతం, 50 నిమిషాల్లో 80 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందట. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 49,999.