Redmi K50i 5G: రెడ్‌మీ కే సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. భారత్‌లో రెడ్‌మీ కే20 సిరీస్ పాపులర్ అయిన నేపథ్యంలో ఇప్పుడు రెడ్‌మీ కే 50ఐ 5జీ పేరుతో మరిన్ని ఫీచర్లతో కొత్త ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చింది. ఇది రెడ్‌మీ నోట్ 11టీ ప్రో ప్లస్‌కు రీబ్రాండెడ్ వర్షన్. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్తో వస్తుంది. 12 రకాల 5జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్ కూడా ఇదే.
- Redmi k50i 5g Price in India: రెడ్‌మీ కే 50ఐ 5జీ రెండు వేరియంట్లలో లభించనుంది. వీటిలో ప్రారంభ వేరియంట్ 6జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 25,999గా నిర్ణయించింది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999.
- వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్ యాంగిల్, 2 ఎంపీ కెమెరాలున్నాయి. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఎమ్‌ఐయూఐ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది.
- Redmi K50i 5G Launched: జులై 23 నుంచి అమెజాన్,ఎంఐ.కామ్,ఎంఐ.హోమ్ స్టోర్స్,క్రోమా ఇతర రిటైల్ అవుట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.3,000 డిస్కౌంట్ లభించనుంది.
ఫీచర్లు..
- 6.6 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే
- 144 హెర్ట్జ్ డైనమిక్ రీఫ్రెష్ రేట్
- 270 హెర్ట్జ్ టచ్ రెస్పాన్స్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్సెట్
- 5,080 ఎంఏహెచ్ బ్యాటరీ
- 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్
- 64 మెగా పిక్సల్ రియర్ కెమెరా
- 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపీ మాక్రో షూటర్
- సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా