రెడ్మీ సంస్థ నుంచి కొత్త స్మార్ట్ఫోన్ విడుదలైంది. 'రెడ్మీ 10'ను సంస్థ భారత మార్కెట్లో అందుబాటులోకి తెచ్చింది. భారీ బ్యాటరీతో ఈ స్మార్ట్ఫోన్ను రూపొందించింది రెడ్మీ. ఫొన్ డిజైన్ సైతం ఆకట్టుకుంటోంది. పొరపాటున కిందపడినా స్మార్ట్ఫోన్కు ఏమీ కాదని సంస్థ చెప్పుకొచ్చింది.
ప్రత్యేకతలు
- 6 నానోమీటర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 చిప్సెట్
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
- 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్
- 6.71 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే
- డ్యూయల్ కెమెరా (50 మెగా పిక్సెల్ ప్రైమరీ, 2ఎంపీ డెప్త్ సెన్సార్)
- 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
- 1.5 వాట్ లౌడ్ స్పీకర్లు
మూడు రంగుల్లో ఈ స్మార్ట్ఫోన్ లభిస్తుంది. మిడ్నైట్ బ్లాక్, పసిఫిక్ బ్లూ, కరీబియన్ గ్రీన్ కలర్లలో ఫోన్ అందుబాటులో ఉండనుంది.