తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

WIFI Connection Issue : వైఫై ఇబ్బంది పెడుతోందా?.. రౌటర్ మొరాయిస్తోందా?.. అయితే ఈ టిప్స్ మీ కోసమే! - Ways to Boost Your Wi Fi Signal

WIFI Connection Problem : మీరు ఇంట్లో వాడే వైఫై కనెక్షన్ మిమ్మల్ని తెగ ఇబ్బంది పెడుతోందా? రౌటర్ పదే పదే మొరాయిస్తోందా? ఈ సమస్యలను పరిష్కరించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ టిప్స్ పాటిస్తే వైఫై సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. నిపుణులు ఇస్తున్న సూచనలు ఏంటంటే..

How to fix WIFI Connection Problem
how to fix wifi connection issues

By

Published : Aug 1, 2023, 11:46 AM IST

WIFI Connection Issue : టెక్నాలజీ విప్లవంతో ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అందరి చేతుల్లోకి మొబైల్ ఫోన్లు వచ్చేయడం వల్ల ఇంటర్నెట్ వాడకం తప్పనిసరిగా మారిపోయింది. సోషల్ మీడియా యాప్స్ వాడాలంటే ఇంటర్ నెట్ ఉండాల్సిందే. సినిమాలు, క్రికెట్ స్ట్రీమింగ్ చేయాలన్నా నెట్ తప్పనిసరి. ఇంటర్నెట్​​కు డిమాండ్ పెరగుతుండటంతో వినియోగదారుల దగ్గర నుంచి డేటా ప్యాకేజీల రూపంలో భారీగా డబ్బులు దండుకుంటున్నాయి టెలికం కంపెనీలు. దీనితో చాలా మంది వైఫై వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఒక వైఫ్ కనెక్షన్​తో ల్యాప్​టాప్​లు, టాబ్లెట్​తో పాటు పలు స్మార్ట్​ఫోన్లలోనూ డేటాను వాడుకునే సౌలభ్యం ఉండటంతో అందరూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఒక్కోసారి వైఫై కనెక్షన్ యూజర్లను ఇబ్బంది పెడుతుండటాన్ని గమనించే ఉంటారు. ముఖ్యమైన జూమ్ కాల్​లో ఉన్నప్పుడు లేదా ఓటీటీలో కొత్తగా రిలీజైన ఒక సినిమానో, వెబ్ సిరీస్​నో చూస్తుంటే వైఫై కనెక్షన్ ఆగిపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలాంటి సమస్యను వర్క్​ ఫ్రమ్​ హోమ్​ జాబ్​ చేసేవాళ్లు కూడా తరచూ ఎదుర్కొంటూ ఉంటారు. మీరు వాడే వైఫై పదే పదే డిస్​కనెక్ట్​ అవుతోందా? అయితే దాన్ని ఎలా పరిష్కరించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఎక్కువ డివైజ్​లు కనెక్ట్ చేయొద్దు
WIFI connected devices list : ఒకప్పుడు ఇళ్లల్లో ఒక కంప్యూటర్ ఉంటే గొప్పగా భావించేవారు. కానీ ఈ రోజుల్లో ఇంట్లో వాడే టెక్ ప్రొడక్ట్​ల జాబితా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి ఐప్యాడ్స్, స్మార్ట్ టీవీలు లాంటివి అందరి ఇళ్లలోకీ వచ్చేశాయి. అయితే ఇన్ని డివైజ్​లు ఒకేసారి వైఫైకి కనెక్ట్ చేస్తే సమస్యలు తప్పవని టెక్ ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఎక్కువ డివైజ్​లు వైఫైకి కనెక్ట్ చేస్తే డేటా స్పీడ్ తగ్గడంతో పాటు ఒక్కోసారి కనెక్షన్ పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. కనుక మీ డివైజ్​ల్లో ఏది వాడట్లేదో చూసి, దాన్ని డిస్​కనెక్ట్ చేయాలి. మీ వైఫై కనెక్షన్​తో ఇరుగు పొరుగు వాళ్లూ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కనుక తరచూ వైఫై పాస్​వర్డ్ మారుస్తూ ఉండాలి. దీని వల్ల వైఫై మిస్​ యూజ్ కాకుండా ఉంటుంది. ఒక వేళ అవసరమైతే మీరు వినియోగించే డివైజ్​లను రీజాయిన్ కూడా చేసుకోవచ్చు. అందుకు బ్రాడ్​ బ్యాండ్స్​ను తగ్గిస్తే సరిపోతుంది. ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉండాలంటే బ్యాండ్​ను 6 గిగా హెడ్జెస్​ ఉండేలా సెట్ చేసుకోవాలి. కనెక్షన్ సమస్య వేధిస్తే మాత్రం దీన్ని 2.4 గిగా హెడ్జెస్​కు మార్చుకోవాలి. దీని వల్ల వైఫై రేంజ్ పెరుగుతుంది. కానీ డేటా స్పీడ్ తగ్గుతుంది. ఇంటర్నెట్ చాలా మెళ్లగా వస్తోందంటే వైఫై వాడకాన్ని తగ్గించాలి. గేమ్స్ లేదా సినిమాలు డౌన్​లోడ్స్ చేస్తున్నట్లయితే ఆపాలి. అలాగే కనెక్టివిటీని అప్​గ్రేడ్ చేయాలి. మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసుకునేందుకు స్పీడ్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. మీకు వస్తున్న డేటా స్పీడ్ కంటే ఇంకా వేగంగా ఇంటర్నెట్ కావాలని అనుకుంటే ఇంటర్నెట్ ప్రొవైడర్​ను అడిగి హయ్యర్ స్పీడ్ ఉండే ప్లాన్​కు మారవచ్చు.

2. రౌటర్ ఎక్కడ ఉంచారో చూస్కోండి!
Move objects away from your router : వైఫై ఫెయిల్యూర్​కు ఎక్కువగా రౌటర్​లో ఉండే సమస్యలే కారణమని నిపుణులు అంటున్నారు. రౌటర్​ను ఇరుగ్గా లేదా సిగ్నల్ రాని చోట పెడితే ఇంటర్​నెట్ స్పీడ్ రాదని చెబుతున్నారు. గాలి తగిలే చోట, సిగ్నల్ ఎక్కడైతే ఎక్కువగా వస్తుందో చూసుకొని అక్కడ రౌటర్​ను ఉంచితే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. మీరు వాడే కంప్యూటర్, ల్యాప్​టాప్, ట్యాబ్లెట్, మొబైల్ ఫోన్లకు వైఫై రౌటర్ దగ్గర్లో ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో గాజుతో తయారు చేసిన వస్తువులను దీనికి దూరంగా ఉంచాలి.

3. ఆ అప్లికేషన్ వాడాల్సిందే
WIFI analyzer app : వైఫై కనెక్షన్​ను వాడే చాలా మంది.. రౌటర్లను తమ ఫోన్లు, బ్లూటూత్ డివైజ్​లు, స్మార్ట్​ టీవీల పక్కనే పెడతారు. ఈ డివైజ్​లకు రౌటర్ కాస్త దగ్గరగా ఉంటే సరిపోతుంది. కానీ వాటి పక్కనే పెట్టొద్దని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సిగ్నల్ డ్రాపింగ్ సమస్య ఏర్పడుతుందట. తక్కువ దూరంలో మూడ్నాలుగు వైఫై రౌటర్లు ఇన్​స్టాల్ చేసి ఉన్నా ఈ సమస్య వస్తుందట. దీనికి వైఫై అనలైజర్ అలాంటి అప్లికేషన్​ను వాడటమే పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అప్లికేషన్ ద్వారా ఏ వైఫై ఛానల్ తక్కువగా వినియోగిస్తారో తెలుసుకొని దాన్నే ఎంచుకుంటే సరిపోతుంది. అలాగే బ్యాండ్​విడ్త్​ను కూడా తగ్గించుకోవాలి.

4. అప్​డేట్ చేస్తూ ఉండాలి
Router app update : ప్రింటర్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజ్​ల్లో ఎప్పటికప్పడు డ్రైవర్స్​ను అప్​డేట్ చేస్తూ ఉండాలి. మీరు ఒకే డివైజ్​ను వాడుతున్నా వైఫై కనెక్షన్ డ్రాప్ అవుతూ ఉంటే.. వెంటనే మీరు వాడే డివైజ్ డ్రైవర్స్​ను అప్ డేట్ చేశారా, లేదా చెక్ చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

5. రౌటర్​కు రెస్ట్ తప్పనిసరి
How to reboot router WIFI : కొందరు వినియోగదారులు ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను విపరీతంగా వాడుతుంటారు. వైఫై ఇంటర్నెట్​ను ఇలాగే ఇష్టం వచ్చినట్లు వాడి డేటా స్పీడ్​ను చేజేతులా తగ్గిస్తూ పోతారు. సెల్​ఫోన్స్​, ల్యాప్​టాప్స్ లాంటి పలు డివైజ్​లను కనెక్ట్ చేసి ఫుల్ స్పీడ్​లో గంటల కొద్దీ వాడుతుంటారు. దీని వల్ల రౌటర్​పై తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. కనుక కుదిరినప్పుడల్లా రౌటర్, మోడెమ్​ను 30 సెకన్ల పాటు ఆఫ్ చేసి తిరిగి ఆన్ చేయాలి.

6. టెక్నాలజీకి తగ్గట్లు అప్​గ్రేడ్ కావాల్సిందే
Technology Upgradation : పైన చెప్పిన సూచనలు పాటిస్తే వైఫై కనెక్షన్స్​లో ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ వైఫై కనెక్షన్​లో గనుక ఇబ్బందులు ఎదురైతే వెంటనే టెక్నీషియన్​ను కలవాలి. అవసరమైతే రౌటర్, మోడెమ్​ లాంటివి మార్చడం, కొత్త టెక్నాలజీకి అప్​గ్రేడ్ అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త సేవలకు తగ్గట్లు పాత రౌటర్లు పనిచేయాలంటే అన్ని వేళలా కుదరని పని అని అంటున్నారు. రీసెట్ చేసినా, రీస్టార్ట్ చేసినా రౌటర్ మొరాయిస్తే, వెంటనే కొత్త దానికి మారిపోతే బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details