Realme C53 Mobile Details in Telugu : ఇప్పుడు ఫోన్ నిత్యావసరం. అందులోనూ స్మార్ట్ ఫోన్.. అడిషనల్ ఫీచర్స్ అనేవి సౌకర్యం కోటాలోకి వస్తాయి. చాలా మంది సూపర్ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకుందామని అనుకుంటారుగానీ.. డబ్బులు సరిపోవు. ఇలాంటి వారికోసం సూపర్ ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి వచ్చేసింది. అదే.. రియల్‌మీ(Realme). రియల్‌మీ సీ53(Realme C53) పేరుతో తీసుకొచ్చారు తయారీదారులు. అందరికీ అందుబాటు ధరలో అదిరిపోయే ఫీచర్స్‌తో దీనిని ప్రవేశపెట్టారు. ఇంతకీ దీని ధర ఎంత? ఇందులో ఉన్న బెస్ట్ ఫీచర్స్ ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Realme C53 Price Details : రియల్‌మీ C53 ధర 10వేల రూపాయలు. ఇందులో కెమెరా అదుర్స్ అనేలా ఉంటుంది. ఏకంగా.. 108 మెగా పిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కాకపోతే రియల్‌మీ C53 5జీ ఫోన్ కాదు.. 4జీ నెట్‌వర్క్‌పై మాత్రమే పనిచేస్తుంది. 4జీలోనే మంచి ఫీచర్లతో ఫోన్ కావాలంటే.. ఈ ఫోన్ పరిశీలించొచ్చు. ఇది రెండు వేరియంట్లలో వస్తోంది. ఇందులో 4జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.9,999గా కంపెనీ నిర్ణయించింది. 6జీబీ+64జీబీ వేరియంట్ ధరను రూ.10,999గా డిసైడ్ చేసింది. అయితే.. మీరు ఎక్కువ RAM కావాలంటే స్టోరేజీ విషయంలో రాజీ పడాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. రియల్‌మీ C53 ఫోన్ ఛాంపియన్ గోల్డెన్, ఛాంపియన్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.ఫ్లిప్‌కార్ట్(Flipkart) వేదికగా జులై 26 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం అయ్యాయి.
రియల్‌మీ సీ53 స్పెసిఫికేషన్స్ : (Realme C53 Specifications and Features) :
ఇది ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐటీ ఎడిషన్‌తో ఈ ఫోన్ వస్తోంది.
6.74 అంగుళాల డిస్‌ప్లే ఉంది.
ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది.