Realme C35: బడ్జెట్ రేంజ్లో కొత్తగా ఫోన్ తీసుకోవాలనుకునేవారి కోసం ఆసక్తికర ఫీచర్లతో కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది రియల్మీ. అదే సీ35. భారత్‌లో సోమవారం ఈ మొబైల్‌ను విడుదల చేసింది. సీ35 ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..
సీ35 ఫీచర్లు..
- ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్మీ యూఐ ఆర్ ఎడిషన్ ఓఎస్‌తో పనిచేస్తుంది.
- 6.6 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తోంది.
- ఆక్టాకోర్ యూనిసాక్ టీ616 ప్రాసెసర్ ఉపయోగించారు. 4జీబీ ఎల్పీడీడీఆర్ఎక్స్ ర్యామ్ ఇస్తున్నారు.
- ఈ ఫోన్లో వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఉన్నాయి. రియల్మీ జీటీ2లో అందించే 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు వెనుకవైపు మరో రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు.
- ముందు సోనీ ఐఎంఎక్స్355 లెన్స్‌తో 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.
- 128జీబీతో రియల్మీ సీ35 రానుంది. దానిని 256జీబీకి పెంచుకునే అవకాశం ఉంది.
- రియల్మీ సీ35లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
సీ35 ధర..