రియల్మీ నుంచి స్మార్ట్ ఫోన్ వస్తోందన్న వార్త.. ఫోన్ ప్రియులను ఎప్పుడూ ఆకర్షిస్తూనే ఉంటుంది. తాజాగా.. రియల్మీ సీ11 2021 మోడల్.. రష్యా, ఫిలిప్పీన్స్ ఈ-కామర్స్ సైట్లలో లిస్ట్ అయ్యింది. గతేడాది విడుదలైన రియల్మీ సీ 11కు ఇది అప్డేటెడ్ వెర్షన్ అని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే మీడియాటెక్, క్వాల్కమ్ ఎస్ఓసీ ఆధారంగా రూపొందించని తొలి రియల్మీ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. మరి ఈ ఫోన్ ధర, ఫీచర్స్ తెలుసుకుందామా...?
ఫీచర్స్ ఇలా..
- ఆండ్రాయిడ్-11 ఆధారిత రియల్మీ యూఐ 2.0
- 6.5 అంగుళాల హెచ్డీ+(720X1,600పిక్సెల్స్) ఎల్సీడీ డిస్ప్లే
- 60హెచ్‌జెడ్ స్క్రీన్ రీఫ్రెష్ రేట్
- యూఎన్ఐఎస్ఓసీ ఎస్సీ9863 ఎస్ఓసీ ప్రాసెసర్
- 2జీబీ ర్యామ్- 32జీబీ స్టోరేజ్+ మైక్రో ఎస్డీ కార్డ్
- 8మెగా పిక్సెల్ రేర్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ సెన్సర్
- 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 10డబ్ల్యూ ఛార్జింగ్
ఐరన్ గ్రే, లేక్ బ్లూ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉండనుంది.