అసోం-మిజోరాం సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు మిజోరం సీఎం జోరామ్ తంగా, ఆసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో ఆదివారం ఫోన్లో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా . వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఫోన్ సంభాషణ అనంతరమే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని తెలిపారు జోరామ్ తంగా. ఈ సమయంలో పరిస్థితులు చేయిదాటకుండా ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. సామాజిక మాధ్యమాల్లో ఎలాంటి వివాదాస్పద పోస్టులు పెట్టొద్దని మిజోరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
సీఎంపై ఎఫ్ఐఆర్ ఉపసంహరణ..
అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను ఉపసంహరించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు మిజోరం ప్రభుత్వం అదివారం తెలిపింది. నిజానికి ఎఫ్ఐఆర్లో హిమంత పేరును ప్రస్తావించేందుకు మిజోరం ముఖ్యమంత్రి జోరామ్ తంగా ఆమోదించలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్నున్మావియా చువాంగో వెల్లడించారు. దానిపై పరిశీలించాలని సీఎం సూచించినట్లు చెప్పారు. హిమంతకు వ్యతిరేతికంగా తగిన ఆధారాలు లేకపోతే పోలీసులతో చర్చించి, ఆయన పేరును ఎఫ్ఐఆర్ నుంచి తొలగిస్తామని సీఎస్ తెలిపారు.
ఎందుకు ఎఫ్ఐఆర్?
అసోం-మిజోరం సరిహద్దుల్లో జులై 26న జరిగిన ఘర్షణల్లో ఐదుగురు అసోం పోలీసులు మరణించారు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసోం సీఎం హిమంత, ఆరుగురు అధికారులు సహా మరో 200 మంది వ్యక్తులపై మిజోరం పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
అయితే సీఎంతో పాటు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించిన వారి పేర్ల తొలగింపుపై మిజోరం సీఎస్ చువాంగో స్పష్టతనివ్వలేదు.
తటస్థ సంస్థకు అప్పగించాలి..