ప్రభుత్వ రంగ సంస్థ రైల్టెల్ దేశవ్యాప్తంగా 4 వేల రైల్వే స్టేషన్లలో ప్రీ పెయిడ్ వైఫై సేవలను లాంఛనంగా ప్రారభించింది. రైల్వే ప్రయాణికులకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా ఈ సేవలను తెచ్చినట్లు పేర్కొంది రైల్టెల్.
ఉచిత వైఫై సేవలు కొనసాగుతాయా?
దేశవ్యాప్తంగా 5,950 స్టేషన్లలో కొన్నేళ్లుగా ఉచిత వైఫై సేవలు అందిస్తోంది రైల్టెల్. స్మార్ట్ఫోన్ ఉన్న ఎవరైనా ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా ఉచిత ఇంటర్నెట్ను పొందొచ్చు.
కొత్తగా ప్రీ పెయిడ్ వైఫై సేవలు ప్రారంభమైన నేపథ్యంలో ఇకపై యూజర్లు 30 నిమిషాల వరకు 1 ఎంబీపీఎస్ వేగంతో ఉచితంగా ఇంటర్నెట్ వాడుకునేందుకు వీలుంటుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం (దాదాపు 34 ఎంబీపీఎస్) నామమాత్రపు ఛార్జీలు చెల్లించాలి.