తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

PUBG: పబ్​జీ వచ్చేసింది- ఇలా చేస్తేనే డౌన్​లోడ్... - పబ్​జీ

పబ్​జీ ప్రియులకు శుభవార్త. భారత్​లో ఈ గేమ్ మళ్లీ అందుబాటులోకి వచ్చింది. యాప్​ స్టోర్​లో ఈ గేమ్ బీటా వెర్షన్ విడుదలైంది. కొత్త పేరుతో వచ్చిన ఈ గేమ్​.. దాదాపు పబ్​జీలానే ఉంది.

Battlegrounds Made Available for Beta Testers
PUBG: పబ్​జీ వచ్చేసింది- డౌన్​లోడ్​కు రెడీ!

By

Published : Jun 17, 2021, 5:18 PM IST

భారత్​లో నిషేధం ఎదుర్కొని సరికొత్త పేరుతో మళ్లీ మార్కెట్​లోకి ప్రవేశించిన పబ్​జీ గేమ్.. యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. 'బ్యాటిల్​గ్రౌండ్స్​ మొబైల్ ఇండియా' పేరుతో వచ్చిన ఈ గేమ్​ బీటా వెర్షన్ మోడ్.. యాప్​ స్టోర్​లో దర్శనమిచ్చింది. జూన్ 18న బీటా వర్షన్ రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చినప్పటికీ.. ఒకరోజు ముందుగానే ఇది విడుదలైంది.

పబ్​జీ కొత్త వెర్షన్

బీటా టెస్టర్లకు మాత్రమే ఈ గేమ్ ఇన్​స్టాల్ చేసుకొని ఆడేందుకు వీలుంటుంది. కాబట్టి కొద్ది మందికి మాత్రమే ఇది అందుబాటులో ఉన్నట్లు లెక్క. అయితే, కొద్దిరోజుల్లో మరిన్ని బీటా టెస్టింగ్ స్లాట్​లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

కొత్త గేమ్ సైజ్ 721 ఎంబీలుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ బీటా టెస్టర్ ఈ యాప్​ను డౌన్​లోడ్ చేసుకొని.. స్క్రీన్​షాట్​లను ట్విట్టర్​లో షేర్ చేశారు. గేమ్ దాదాపుగా పబ్​జీని పోలినట్టే ఉంది. రక్తం ఎరుపు రంగుకు బదులు పచ్చగా ఉండటం, ఇతర గ్రాఫిక్స్​ మునుపటిలాగే ఉన్నాయి. కొత్త గేమ్​లో యూజర్లు లాగిన్ అయ్యేందుకు ఓటీపీ అవసరం లేదు.

యాప్​ స్టోర్​లో 'బ్యాటిల్​గ్రౌండ్స్'

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details