తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Nokia G20: బడ్జెట్​ ధరలో నోకియా కొత్త ​ఫోన్​ - హెజ్​ఎండీ గ్లోబల్​

నోకియా నుంచి మరో స్మార్ట్​ఫోన్​ అందుబాటులోకి రానుంది. ఈ నెల 7న అమెజాన్​లో నోకియా జీ20 ప్రీ-బుకింగ్​ మొదలుకానుంది. ఈ స్మార్ట్​ఫోన్​ ప్రత్యేకతలు, ధర వివరాలు మీరూ చూసేయండి.

NOKIA G20
నోకియా జీ20

By

Published : Jul 5, 2021, 1:27 PM IST

స్మార్ట్​ఫోన్లలో నోకియా ప్రాడక్టులకు మంచి డిమాండ్​ ఉంది. అందుకు తగ్గట్టుగానే నోకియా మాతృ సంస్థ హెచ్​ఎమ్​డీ గ్లోబల్​.. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలు రచిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే నోకియా జీ20(Nokia G20)ని సిద్ధం చేసింది. ఇప్పుడు ఇది అమెజాన్​ ఇండియాలో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించి ప్రీ-బుకింగ్స్​ ఈ నెల 7న ప్రారంభం కానున్నాయి.

జులై 7, మధ్యాహ్నం 12 గంటలకు ప్రీ-బుకింగ్​ మొదలవుతుంది. మరి ఈ కొత్త స్మార్ట్​ఫోన్​కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు చూసేయండి...

ఫీచర్లు(Nokia G20 features)

6.5 అంగుళాల డిస్​ప్లే, 720X1600 పిక్సల్స్​ రిసొల్యూషన్​

48ఎంపీ+5ఎంపీ+2ఎంపీ+8ఎంపీ కెమెరా

ఆండ్రాయిడ్​ 11

స్నాప్​డ్రాగన్​ 662 ప్రాసెసర్​

4జీబీ ర్యామ్​- 64/128జీబీ స్టోరేజీ

5,050 ఎమ్​ఏహెచ్​ బ్యాటరీ

నోకియా జీ20

ధర​(Nokia G20 price)

ఈ స్మార్ట్​ఫోన్​ బడ్జెట్​ ధరలో ఉండటం విశేషం. ఇండియాలో.. నోకియా జీ20​.. రూ. 12,999కి అందుబాటులోకి రానుంది. నైట్​, గ్లేషియర్​ రంగుల్లో నోకియా జీ20 వినియోగదారులను పలకరించనుంది.

ఇదీ చూడండి:-రూ.15వేలలో ఫోన్ కొనాలా? వీటిపై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details