తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరు ఈ తప్పులు చేస్తున్నారా..?

ఈ రోజుల్లో మనుషులతో కంటే ఫోన్​తోనే ఎక్కువగా గడుపుతున్నాం. ఆహారం లేకుండా అయినా ఉంటాం కానీ సెల్​ఫోన్​ లేకుంటే మాత్రం రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి ఫోన్​ను చాలా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఫోన్​కు ప్రాణం పోసేది ఛార్జింగే. కాబట్టి అలాంటి ఛార్జింగ్​ విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరని చెప్పాలి.

By

Published : Feb 4, 2023, 7:59 PM IST

Dos and Donts of charging your phone
ఛార్జింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మన నిత్య జీవితంలో చాలా సమయాన్ని స్మార్ట్​ఫోన్​తోనే గడుపుతుంటాం. మరి ఫోన్లకు ఛార్జింగ్ అనేది చాలా ముఖ్యం. అయితే ఫోన్​కు ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎందుకంటే మనం కొన్న ఫోన్​ ఎక్కువ కాలం పనిచేయాలంటే సరైన రీతిలో ఛార్జింగ్ పెట్టడం చాలా ముఖ్యం. మరి ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటాం. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.

తక్కువ క్వాలిటి వాల్​ప్లగ్​లతో ప్రమాదమే
ఛార్జింగ్ పెట్టడానికి క్వాలిటీలెస్​ వాల్​ప్లగ్​లను వాడకూడదు. నాణ్యమైనవి వాడడమే మేలు. ఈ కామర్స్ సంస్థల్లో, ఇంకెక్కడ అయినా తక్కువ ధరలో వస్తున్నాయని క్వాలిటీ లేని ఛార్జర్​లు కొనుగోలు చేస్తే అవి ఫోన్లను డ్యామేజ్ చేస్తాయి. అధిక నాణ్యత గల ఛార్జర్‌లను వాడాలి. ఇవి మీ ఫోన్‌ను ఓవర్‌చార్జింగ్ అయినప్పుడు పవర్ సప్లైను నిలిపివేయడమే కాకుండా ఫోన్ వేడెక్కకుండా ఉంచుతాయి. కాబట్టి ఛార్జర్‌ను కొనుగోలు చేసేటప్పుడు నాణ్యత అనేది చాలా ముఖ్యమైన విషయం.

ఛార్జింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కంపెనీ ఛార్జర్లకే అధిక ప్రాధాన్యత
మనం ఫోన్​ కొనుగోలు చేసినప్పుడు ఇచ్చిన ఛార్జర్లను వాడటమే మంచిది. వేరే ఛార్జర్లను ఉపయోగించకపోవడమే ఉత్తమం. కంపెనీ స్పెసిఫికేషన్లు ఉన్న ఛార్జర్లను వాడాలి. వేరే ఛార్జర్లను వాడితే ఫోన్ పనితీరు దెబ్బతింటుంది.

ఫోన్ పౌచ్​ను ప్రమాదకరమే..
మనం ఫోన్​ కింద పడినప్పుడు పగిలిపోకుండా ఉండటం కోసం రక్షణగా పౌచ్​లను ఉపయోగిస్తుంటాం. కానీ అవి కూడా మన ఫోన్ మీద ఎంతో ప్రభావం చూపుతాయి. ఛార్జింగ్ పెట్టినప్పుడు పౌచ్​ను అలాగే ఉంచితే ఫోన్​ వేడెక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుందని అనిపించినప్పుడు పౌచ్​ను తీసేయడం ఉత్తమం.

ఛార్జింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఉపయోగించవద్దు..
ఛార్జింగ్ పెట్టి ఫోన్​ను ఉపయోగించడం అనేది అత్యంత ప్రమాదకరం. ఛార్జింగ్​ పెట్టి ఫోన్​ను వాడితే మొబైల్ వేడెక్కుతుంది. ఈ ఒత్తిడి ఫోన్​ బ్యాటరీ, స్క్రీన్, ప్రాసెసర్ మీద పడుతుంది. అప్పుడు ఫోన్​ స్లో అవ్వడం, వేడెక్కడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఫోన్​లో ఛార్జింగ్ మొత్తం పూర్తయ్యేవరకు వాడకపోవడం మంచిది. కొన్నిసార్లు ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడటం వల్ల అవి పేలిపోయే అవకాశాలు సైతం ఉన్నాయి. ఎందుకంటే ఫోన్​కు పవర్ సప్లై అనేది రెండు దిశలలో జరుగుతుంది. దీని వల్ల ఎక్కువ ఒత్తిడి జరిగి పేలిపోయే ప్రమాదాలున్నాయి.

బ్యాటరీతో నడిచే పోర్టబుల్ ఛార్జర్‌లతో జాగ్రత్తలు అవసరం
పోర్టబుల్ ఛార్జర్‌లు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. నాణ్యమైన దానిని ఉపయోగించకుంటే అవి కూడా ఫోన్‌కు హాని కలిగిస్తాయి. మంచి బ్రాండ్‌లు, భద్రత ఉన్న ఛార్జర్లనే ఉపయోగించాలి. ప్లగ్-ఇన్ ఛార్జర్‌ల లాగానే యాపిల్ ప్రోడక్ట్స్ కాకుండా వేరేవి ఉపయోగించాలనుకుంటే యాపిల్ ఎఎఫ్​ఐ ధృవీకరణ ఉందో లేదో చూసుకొని తీసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్​లకు ఉపయోగించే సీ-పిన్​ ఛార్జర్లను యూఎస్​బీ-ఐఎఫ్​ ధృవీకరించిందో లేదో చూసుకోవాలి.

ఛార్జింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఫోన్​లో యాప్​లది కూడా ప్రధాన పాత్రే
మన ఫోన్​లో ఎక్కువ స్పేస్​ను ఆక్రమించే యాప్​లుంటాయి. ఇవి ఎక్కువ స్పేస్ తీసుకోవడమే కాకుండా బ్యాటరీని కూడా అధికంగా ఉపయోగిస్తుంటాయి. దీనివల్ల ఛార్జింగ్ తొందరగా దిగి పోవడం లాంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ఎక్కువ బ్యాటరీ ఉపయోగించే యాప్​లను వాడకపోవడమే మంచిది. వాటి స్థానంలో లైట్ వర్షన్​ యాప్​లను ఉపయోగించడం చాలా మంచిది. స్పైవేర్, యాడ్‌వేర్, మాల్వేర్ లాంటి సమస్యలు మనకు తెలియకుండానే వస్తుంటాయి. అవి ఫోన్‌కు సోకాయో లేదో చూసుకోవాలి. ఎలాంటి వైరస్​లు ఫోన్​కు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details