తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Latest Poco Mobile : రూ.10 వేలకే పోకో 5జీ ఫోన్​.. ఫ్లిప్​కార్ట్​లో సేల్​ ఎప్పుడంటే? - Latest Poco Mobile

Poco M6 Pro 5G Sale News In Telugu : చైనీస్​ కంపెనీ షావోమీ సబ్​బ్రాండ్​ పోకో.. లేటెస్ట్​గా ఇండియన్​ మార్కెట్​లో Poco M6 Pro 5G స్మార్ట్​ఫోన్​ను లాంఛ్​ చేసింది. దీనిని ఆగస్టు 9 నుంచి ఫ్లిప్​కార్ట్​లో విక్రయానికి ఉంచనున్నారు. మరి ఈ పోకో ఫోన్​ వేరియంట్స్, ఫీచర్స్​, ప్రైస్​ వివరాలు తెలుసుకుందాం రండి.

Poco M6 Pro 5G specs and features
Poco M6 Pro 5G

By

Published : Aug 6, 2023, 3:16 PM IST

Poco M6 Pro 5G Sale News : షావోమీ సబ్​బ్రాండ్​ పోకో భారతమార్కెట్​లో Poco M6 Pro 5G స్మార్ట్​ఫోన్​ను లాంఛ్​ చేసింది. ఆగస్టు 9 నుంచి ఈ స్మార్ట్​ఫోన్​ ఫ్లిప్​కార్ట్​లో అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

పోకో ఎం6 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్​
Poco M6 Pro 5G Specifications :

  • డిస్​ప్లే : 6.79 అంగుళాల ఫుల్​ హెచ్​డీ+ 90Hz రిఫ్రెష్​రేట్
  • ప్రాసెసర్​ :క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 4 జెన్​2
  • ఓఎస్​ :ఆండ్రాయిడ్​ 13 బేస్డ్​ MIUI 14
  • స్టోరేజ్​ : 4జీబీ + 64 జీబీ & 6జీబీ+128జీబీ
  • బ్యాటరీ : 5000mAH + 18వాట్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ సపోర్ట్​
  • రియర్​ కెమెరా : 50 ఎమ్​పీ ఏఐ సెన్సార్​ + 2ఎమ్​పీ డెప్త్​ సెన్సార్​
  • ఫ్రంట్​ కెమెరా : 8 మెగాపిక్సెల్​

పోకో ఎం6 ప్రో 5జీ ఫీచర్స్​
Poco M6 Pro 5G Features : పవర్​ బ్లాక్​, ఫారెస్ట్ గ్రీన్​ అనే రెండు కలర్​ వేరియంట్స్​తో ఈ ఫోన్ వస్తుంది. దీనిలో సైడ్​ మౌంటెడ్​ ఫింగర్​ప్రింట్ స్కానింగ్​ ఫీచర్​ ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ గొరిల్లా గ్లాస్​ 3 ప్రొటెక్షన్​తో వస్తుంది. ఇది 6.79 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + 90Hz రిఫ్రెష్​రేట్, 240Hz టచ్​ సాంప్లింగ్​ రేట్​తో పనిచేస్తుంది. దీనిలో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 4 జెన్​ 2 ప్రాసెసర్​ ఉంది.​ ఆండ్రాయిడ్​ 13 బేస్డ్​ MIUI 14తో పనిచేసే ఈ స్మార్ట్​ఫోన్​కు మరో 2 మేజర్​ ఓఎస్​ అప్​డేట్స్​ రానున్నాయి. అలాగే మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్​డేట్స్ కూడా ఇస్తామని కంపెనీ స్పష్టం చేసింది. పోకో ఎం 6 ప్రో 5జీ ఫోన్​ టైప్​-సి యూఎస్​బీ సపోర్ట్​తో వస్తుంది. అలాగే దీనికి IP53 డస్ట్​ అండ్​ స్ల్పాష్​ రెసిస్టెన్స్ కూడా​ ఉంది.

పోకో ఎం6 ప్రో 5జీ ధర
Poco M6 Pro 5G Price : ఆగస్టు 9 నుంచి ఈ-కామర్స్​ వెబ్​సైట్​ ఫ్లిప్​కార్ట్​లో ఈ పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్​లో రెండు స్టోరేజ్​ వేరియంట్లు ఉన్నాయి. అవి :

  • 4జీబీ+64జీబీ స్టోరేజ్ వేరియంట్​ పోకో ఫోన్ ధర రూ.9,999గా నిర్ణయించారు.
  • 6జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్​ పోకో ఫోన్ ధర రూ.12,999గా ఉంది.

ABOUT THE AUTHOR

...view details