తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

అంతరిక్షంలో అద్భుతం.. 1000 ఏళ్ల తర్వాత ఒకే వరుసలోకి 4 గ్రహాలు - ఖగోళ వింత

Planet parade 2022 India: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి కనువిందు చేశాయి. దాదాపు 1000 ఏళ్ల తర్వాత చోటుచేసుకుంది ఈ అద్భుత ఘట్టం.

planet parade 2022 india
ప్లానెట్​ పరేడ్​

By

Published : Apr 27, 2022, 4:58 PM IST

Planet parade 2022 India: అంతరిక్షంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 1000 ఏళ్ల తర్వాత ఖగోళంలో ఒకే రేఖపై నాలుగు గ్రహాలు దర్శనమిచ్చాయి. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతితో పాటు శని గ్రహాలు ఒకే రేఖపై కనువిందు చేశాయి. ఆకాశంలో తూర్పున సూర్యోదయానికి ముందు ఈ గ్రహాలు ఒకే రేఖపైన దర్శనమిచ్చినట్లు భువనేశ్వర్​లోని పఠాని సమంత ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్​ సువేందు పట్నాయక్​ తెలిపారు.

"2022, ఏప్రిల్​ 26, 27 తేదీల్లో ఈ అరుదైన గ్రహాల కూర్పు కనిపించింది. దీనిని ప్లానెట్​ పరేడ్​గా చెబుతారు. అయితే, దీనికి శాస్త్రీయంగా ఎలాంటి నిర్వచనం లేదు. సౌర వ్యవస్థలో ఒకే ప్రాంతంలో ఒకే వరుసలోకి గ్రహాలు వచ్చే దానిని ప్లానెట్​ పరేడ్​గా విస్తృతంగా ఉపయోగిస్తారు. "

- సువేందు పట్నాయక్​, ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్​.

ఒకే వరుసలో కనిపిస్తున్న నాలుగు గ్రహాలు
  • అంతరిక్షంలో సాధారణంగా మూడు ప్లానెట్​ పరేడ్​లు కనిపిస్తాయని తెలిపారు సువేందు పట్నాయక్​. అందులో మొదటిది.. సూర్యుడికి ఒకవైపునకు గ్రహాలు ఒకే వరుసలో కనిపిస్తాయి. మూడు గ్రహాలు సూర్యుడికి ఒకవైపునకు కనిపించటం సర్వసాధారణం. ఒక ఏడాదిలో చాలా సార్లు ఇలా కనిపిస్తుంది. అలాగే.. ఏడాదిలో ఒకసారి నాలుగు గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి. ప్రతి 19 ఏళ్లకోసారి ఐదు గ్రహాలు, 170 ఏళ్లకోసారి 8 గ్రహాలు ఒకే వరుసలోకి వస్తాయి.
  • రెండోది.. గ్రహాలు అవి కనిపించే పరిస్థితులతో సంబంధం లేకుండా ఒకే టైమ్​లో ఆకాశంలో ఒక చిన్న ప్రాంతంలో కనిపిస్తాయి. దానిని సైతం ప్లానెట్​ పరేడ్​గానే పిలుస్తారు. ఇంతకు ముందు 2002, ఏప్రిల్​ 18న, 2020, జులైలో ఇలాంటి ప్లానెట్​ పరేడ్​ కనిపించింది.
  • మూడోది.. కొన్ని గ్రహాలకు అనుకూలమైన పరిస్థితులు ఉన్న అరుదైన సందర్భాల్లో ఈ మూడో రకం ప్లానెట్​ పరేడ్​ ఏర్పడుతుంది. మూడు గ్రహాలు ఒకే వరుసలోకి రావటం ఒక ఏడాదిలో చాలా సందర్భాల్లో కనిపిస్తుంది.

2022, ఏప్రిల్​ 26, 27 తేదీల్లో సూర్యోదయానికి ఒక గంట ముందు, చంద్రుడితో పాటు నాలుగు గ్రహాలు తూర్పు అక్షాంక్షానికి 30 డిగ్రీల కోణంలో ఒకే వరుసలో కనిపించాయి. ఇది పైన చెప్పిన విధంగా మూడో రకం ప్లానెట్​ పరేడ్​. గతంలో సుమారు 1000 ఏళ్ల క్రితం క్రీ.శ 947లో జరిగింది. పరిస్థితులు అనుకూలించి శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు ఒకే వరుసలోకి వస్తే.. టెలిస్కోప్ అవసరం​ లేకుండానే చూడవచ్చు. ఏప్రిల్​ 30న శుక్రుడు, బృహస్పతి అత్యంత దగ్గరగా రానున్నాయి. బృహస్పతికి దక్షిణం వైపు 0.2 డిగ్రీల కోణంలో శుక్రుడు కనిపిస్తాడు.

ఇదీ చూడండి:వినువీధుల్లో వ్యర్థాలు.. ఊడ్చేసేందుకు ఇస్రో కసరత్తు

ఆకాశంలో అద్భుతం- 400 ఏళ్ల తర్వాత ఇవాళే!

ABOUT THE AUTHOR

...view details