Pink WhatsApp Scam Latest Updates:టెక్నాలజీ రోజు రోజుకూ విస్తరిస్తుండడంతో.. మొబైల్ అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. వాట్సాప్ కూడా అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. అయితే.. ఇప్పుడో భారీ అప్డేట్ వచ్చిందని ప్రచారం సాగుతోంది. అదే ఐకాన్ కలర్ ఛేంజ్. వాట్సాప్ ఐకాన్ గ్రీన్ కలర్ లో ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ.. కొందరు కేటుగాళ్లు వాట్సాప్ కలర్ మారిపోయిందని.. వెంటనే కొత్త యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని మేసేజ్ లు పంపిస్తున్నారు.
Mumbai Police Alert to WhatsApp Users:ఇటీవల ముంబై పోలీసులు.. పబ్లిక్ అడ్వైజరీలో పింక్ వాట్సాప్(Pink Whatsapp) అనే వైరల్ వాట్సాప్ మెసేజ్ గురించి పలు సూచనలు జారీ చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్‌తో లింక్ చేసిన కొత్త స్కామ్ గురించి హెచ్చరించారు.
WhatsApp Channel Creation : వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేయాలా?... ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!
పింక్ వాట్సాప్ స్కామ్ అంటే ఏంటి..? :
What is Pink Whatsapp Scam:
వాట్సాప్ కలర్ మారిపోయిందని.. కొత్తది డౌన్ లోడ్ చేసుకోవాలని పంపించే లింక్ పై క్లిక్ చేస్తే.. వెంటనే డూప్లికేట్ సైట్ ఓపెన్ అవుతుంది. ఫోన్లో యాప్ డౌన్లోడ్ అవుతుంది. వాట్సాప్‌లో మాదిరిగానే ఇందులోనూ ఫీచర్స్ ఉంటాయి. యాప్ ఓపెన్ చేయగానే మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వమని అడుగుతుంది. సాధారణ వాట్సాప్ మాదిరిగానే ఇందులోని ఫోన్ నెంబర్లు, ఫొటోస్, లొకేషన్ అలో(Allow) చేయమని అడుగుతుంది. వెంటనే వాట్సాప్ పేమెంట్స్ కూడా లాగిన్ అవ్వమని అడుగుతుంది. ఇలా అన్నింటినీ ఎనేబుల్ చేసిన తర్వాత పూర్తి వాట్సాప్ అందుబాటులోకి వస్తుంది. పింక్ వాట్సాప్ డౌన్ లోడ్ అయినా తర్వాత .. అప్పుడప్పుడు హ్యాంగ్ అవుతుంది. మీకు తెలియని వ్యక్తుల చాట్స్, మీరు మెసేజ్ చేయకపోయినా బయట వ్యక్తుల నంబర్లు అందులో కనిపిస్తుంటాయి. అప్పుడప్పుడు కొన్ని అశ్లీల వీడియోలు, ఫోటోలు దర్శనమిస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. మీ ఫోన్ మొత్తం హ్యాకర్ల అధీనంలో ఉంటుంది.
పింక్ వాట్సాప్ స్కామ్ నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :