ప్రముఖ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం సరికొత్త ఫీచర్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. ఇకపై పేమెంట్ చేసిన ప్రతిసారీ పిన్ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా.. 'యూపీఐ లైట్' అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూపీఐ ద్వారా డబ్బును పంపించటం, స్వీకరించే ప్రక్రియలను సులభతరం చేసేందుకు ఈ యూపీఐ లైట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ పేటీఎం 'యూపీఐ లైట్' ద్వారా తక్కువ మొత్తంలో లావాదేవీలను సులభంగా చేసుకోవచ్చు. పేటీఎం యాప్ ద్వారా యూపీఐ పిన్ను వినియోగించే అవసరం లేకుండా ఒక క్లిక్‌తో ఇకపై రూ.200 వరకు చిన్నమొత్తంలో లావాదేవీలను వేగంగా చేసుకోవచ్చు.
ఈ ఆవిష్కరణతో యూపీఐ లైట్ ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి సంస్థగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ పేరొందింది. రూ.2,000 వరకు యాడ్ చేసుకోవటం ద్వారా రోజుకు రెండుసార్లు యూపీఐ వ్యాలెట్‌కు రీఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తంగా దీని రోజువారీ పరిమితి రూ.4,000 ఉంటుంది. బ్యాంక్స్ పరిమితిని పట్టించుకోకుండా యూపీఐ లైట్‌ను ఉపయోగించి అనేక లావాదేవీలను చేసుకోవచ్చు.