తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

ఒప్పొ రెనో 6 వచ్చేసింది- ధర, ఫీచర్లు ఇవే.. - రెనో 6 ప్రో 5జీ స్పెక్స్​

భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది ఒప్పొ. రెనో సిరీస్​కు కొనసాగింపుగా.. రెనో 6, రెనో 6ప్రో వంటి వేరియంట్లను బుధవారం ఆవిష్కరించింది. ఈ రెండు వేరియంట్ల ఫీచర్లు, ధర వివరాలు మీకోసం.

new phones in Reno Series
రెనో సిరీస్​లో కొత్త ఫోన్లు

By

Published : Jul 14, 2021, 6:41 PM IST

Updated : Jul 14, 2021, 8:02 PM IST

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ ఒప్పొ భారత మార్కెట్లో మరో కొత్త మోడల్​ను విడుదల చేసింది. భారత్​లో మంచి ఆదరణ పొందుతున్న రెనో సిరీస్​లో.. రెనో 6 5జీ, రెనో 6 ప్రో 5జీ పేర్లతో ఈ మోడల్​ మార్కెట్లోకి వచ్చింది. రెనో సిరీస్​లోని ఇతర మోడళ్లతో పోలిస్తే.. ఈ కొత్త ఫోన్​ చాలా స్లిమ్​గా ఉండటం గమనార్హం. వీటితో పాటు ఫోన్​ ప్రధాన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేద్దాం.

రెనో 6 5జీ ఫీచర్లు..

రెనో 6 5G
  • 6.43 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే
  • మీడియా టెక్​ డైమెన్సిటీ 900 ప్రాసెసర్
    మీడియా టెక్​ డైమెన్సిటీ 900 చిప్​సెట్
  • ట్రిపుల్ రియర్​ కెమెరా (64ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
  • 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • 4,300 ఎంఏహెచ్​ బ్యాటరీ, 65 వాట్స్ సూపర్​ వూక్​ 2.0 ఫాస్ట్​ ఛార్జింగ్ సపోర్ట్​
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్​

8జీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.29,990 గా నిర్ణయించింది ఒప్పొ. ఈ వేరియంట్ జులై 29 నుంచి ఫ్లిప్​కార్ట్​తోపాటు ఎంపిక చేసిన ఆఫ్​లైన్ స్టోర్లలో కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. జులై 23 నుంచి ప్రీ బుకింగ్​ చేసుకోవచ్చు.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డ్​, బజాజ్ ఫిన్​సర్వ్ ద్వారా ఈ ఫోన్​ను కొనుగోలు చేస్తే రూ.3,000 వరకు క్యాష్​ బ్యాంక్ పొందే వీలుంది.

రెనో 6 ప్రో 5జీ ఫీచర్లు..

రెనో 6 ప్రో 5G
  • 6.55 అంగుళాల ఫుల్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే
  • మీడియా టెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్​
    మీడియా టెక్​ డైమెన్సిటీ 1200 చిప్​సెట్
  • క్వాడ్ రియర్​ కెమెరా (64 ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
  • 32 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా
  • 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 65 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
    65 వాట్స్ ఫాస్ట్ ఛార్జిగ్​ సపోర్ట్​
  • ఆండ్రాయిడ్​ 11 ఓఎస్​

12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధర రూ.39,990. ఈ వేరియంట్ జులై 20 నుంచే కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. బుధవారం నుంచే ప్రీ బుకింగ్​కు అవకాశముంది.

రెనో 6 ప్రో 5జీ ఫోన్​ను.. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కార్డ్​, బజాజ్ ఫిన్​సర్వ్ కార్డ్ ఉపయోగించించి కొనుగోలు చేస్తే.. రూ.4,000 వరకు క్యాష్​ బ్యాక్​ పొందొచ్చు.

ఇదీ చదవండి:చరిత్రలో తొలిసారి.. 200ఎంపీ కెమెరాతో స్మార్ట్​ఫోన్!

Last Updated : Jul 14, 2021, 8:02 PM IST

ABOUT THE AUTHOR

...view details