తెలంగాణ

telangana

ETV Bharat / science-and-technology

Oppo Foldable Phone: ఒప్పో నుంచి ఫోల్డబుల్ ఫోన్​- ఫీచర్లు లీక్​! - ఒప్పో ఫోల్డబుల్​ ఫోన్​ ధర

Oppo Foldable Phone: మార్కెట్​లో మరో ఫోల్డబుల్​ ఫోన్​ రానుంది. ప్రముఖ స్మార్ట్​ ఫోన్​ తయారీ సంస్థ అయిన ఒప్పో దీనిని బుధవారం విడుదల చేస్తోంది. ఒప్పో ఫైండ్​ ఎన్​ పేరుతో రానున్న ఈ ఫోన్​ ధర ఎంతో తెలుసుకునేందుకు స్మార్ట్​ఫోన్​ ప్రియులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

Oppo Foldable Phone
ఒప్పో ఫోల్డబుల్​ ఫోన్

By

Published : Dec 14, 2021, 1:19 PM IST

Oppo Foldable Phone: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో నుంచి తొలిసారిగా ఫోల్డబుల్​ ఫోన్​ను రానుంది. ఒప్పో ఫైండ్​ ఎన్​ (Oppo Find N) పేరుతో పేరుతో ఈ స్మార్ట్​ఫోన్​ను బుధవారం మార్కెట్​లోకి తీసుకువస్తున్నట్లు సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్​ డిజైన్​కు సంబంధించిన కొన్ని ఫొటోలను ప్రముఖ టెక్కీ ఇవాన్​ బ్లాస్​ ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. కొత్త ట్రెండ్​గా మారిని ఫోల్డబుల్​ ఫోన్​కు సంబంధించిన హై రెజల్యూషన్​ చిత్రాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ఇవాన్​ బ్లాస్​ ట్వీట్​లో చూపించినట్లుగా.. ఈ ఫోల్డబుల్​ ఫోన్​ లోపలకు మడిచేందుకు వీలుగా ఉంది. ఫోన్​ మూలలు కూడా చతురస్రాకారంగా కాకుండా గుండ్రంగా ఉండనున్నాయి. ఫొటోల ప్రకారం దీనికి వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా ఉంది.

గెలాక్సీ జెడ్​ ఫోల్డ్ 3 పేరుతో ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్ తీసుకొచ్చింది శాంసంగ్.

ఒప్పో ఫోల్డబుల్​ ఫోన్

లీకుల ప్రకారం చూస్తే.. ఈ ఫోన్ పంచ్​ హోల్ సెల్ఫీ కెమెరాతో రానుంది. 8.4:9 యాస్పెక్ట్​ రేషియోతో పాటు 120హెచ్​జెడ్​ రిప్రెష్​ రేట్​ ఉండనుంది. అంతేగాకుండా గ్రే, వైట్​, పర్పుల్​ రంగుల్లో అందుబాటులోకి రానున్నట్లు లీకైన ఫొటోల ద్వారా తెలుస్తోంది.

ఫోల్డబుల్ ఫోన్​ డిస్​ప్లే

మరికొన్ని ఫీచర్లు ఇలా...

  • డిస్​ప్లే- 8 అంగుళాలు, అమోలెడ్​
  • క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్ 8 జెన్​ 1 ప్రాసెసర్​
  • వెనక కెమెరా- 50ఎంపీ
  • సెల్ఫీ కెమెరా- 32 ఎంపీ
  • బ్యాటరీ- 4,500 ఎంఏహెచ్​
  • 65 వాట్స్​ ఛార్జింగ్​

ఇవీ చూడండి:

Infinix Note 11: తక్కువ ధరకు అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్లు

జంబో బ్యాటరీతో వివో నుంచి సరికొత్త స్మార్ట్​ఫోన్​!

IPhone SE 3: 2022లో ఐఫోన్ ఎస్‌ఈ3.. ఫీచర్లు ఇవే!

ABOUT THE AUTHOR

...view details