Oppo Find N3 Flip Price :చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఫ్లిప్ ఫోన్.. ఫైండ్ ఎన్3 ఫ్లిప్‌ను (Find N3 Flip) భారత్‌లో కొద్ది రోజుల క్రితం లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్ ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఏడాది తీసుకొచ్చిన ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌నకు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ఫ్లిప్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? ధర ఎంత? రివ్యూ ఎలా ఉంది తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం..
Oppo Find N3 Flip Features :ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ 12జీబీ+256జీబీ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధరను రూ.94,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్లపై ₹8వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, ₹12వేల వరకు వివిధ కార్డులపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లు ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఇక ఫోన్‌లో ఉన్న ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో రెండు స్క్రీన్స్ ఉంటాయి. మెయిన్ డిస్‌ప్లే 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో వచ్చింది. 120 Hz రిఫ్రెష్ రేటుతో పనిచేస్తుంది. 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. ఇక ఔటర్ డిస్‌ప్లే విషయానికొస్తే.. 3.26 అంగుళాల ఎస్‌డీ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేతో రూపొందించారు. 60 Hz రిఫ్రెష్ రేటుతో ఇది పనిచేస్తుంది. 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా గొరిల్లా గ్లాస్ 7 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ మొబైల్లో మీడియాటెక్ డిమెన్‌సిటీ 9200 ప్రాసెసర్‌ను కూడా అమర్చారు. ఇది ఆండ్రాయడ్ 13 ఆధారిత కలర్ ఓఎస్ 13.2తో పనిచేస్తుంది.
అదిరే ఫీచర్లతో వన్‌ప్లస్ కొత్త ఫోన్స్, ఇయర్‌బడ్స్.. ధరెంతో తెలుసా?
Oppo Find N3 Flip Specifications :ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్‌లో 50ఎంపీ ఓఐఎస్‌తో కూడిన ప్రధానకెమెరా(Camera)తో పాటు 48 ఎంపీ కెమెరా, 32 ఎంపీ టెలిఫొటో లెన్స్ ఇచ్చారు. క్రీమ్ గోల్డ్, మిస్టీ పింక్, స్లీక్ బ్లాక్ కలర్లలో లభించే ఈ ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 ఎంపీ కెమెరా కూడా అమర్చారు. వన్‌ప్లస్ ఫోన్లలో ఇచ్చే అలర్ట్ స్లయిడర్‌ను ఈ ఫోన్లోనూ ఇస్తున్నారు. దీనిలో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ 44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్ బరువు 198 గ్రాములు. ఎన్‌ఎఫ్‌సీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, బ్లూటూత్ 5.3తో ఈ ఫోన్ వచ్చింది. ఒప్పో తీసుకొచ్చిన తాజా ఫోల్డబుల్ ఒప్పో ఫైండ్ ఎన్3 ఫ్లిప్ ఫోన్ ఇప్పటికే భారత విపణిలో ఉన్న శామ్‌సంగ్ గెలాక్సీ జెట్ ఫ్లిప్ 5, మోటోరోలా రాజర్ 40 ఆల్ట్రాతో పోటీగా నిలవనుంది.