ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో ఎఫ్ సిరీస్‌లో ఎఫ్ 19 పేరుతో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది.
ఈ ఫోన్ ధరను రూ.18,990గా (ప్రీ ఆర్డర్) నిర్ణయించింది కంపెనీ. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, స్టాండర్డ్ అండ్ ఛార్టర్డ్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే.. 7.5 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది.